Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈసీజీ ప్రోగ్రాం వ్యవస్థాపక అధ్యక్షుడు శివప్రసాద్
నవతెలంగాణ-రాయపర్తి
భావితరాలకు నైతిక విలువలను వారసత్వంగా అందించడమే ఈసీజీ ( ఎతికల్ కెరియర్ గైడెన్స్ ) లక్ష్యమని ఈసీజీ ప్రోగ్రాం వ్యవస్థాపక అధ్యక్షుడు శివ ప్రసాద్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రం లోని ప్రభుత్వ కళాశాలలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వ ర్యంలో ఈసీజీ తరగతులను నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు విలువలతో కూడిన విద్యనభ్యసించి సమాజంలో ఆదర్శ వ్యక్తులుగా రాణించాలని తెలిపా రు. వర్తమానపు విద్యార్థులు ఆశయాలను మానవతా విలువలను ఓర్పు, సహనం పెంపొందిం చు కునేలా విద్యను అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్థులు నైతిక విలువలను దైవంగా భావించి జీవితంలో ఉన్న త శిఖరాలను అవరోధించి తల్లిదండ్రులకు కళాశాల కు పేరుప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. సుమా రు 250 పాఠశాలలను తిరిగి, ఎంతోమంది మేధావు లతో చర్చించి ఈసీజీ ప్రోగ్రాంను రూపొందించి నట్లు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలో,కళాశాలలోనిర్విరామంగా విద్యార్థులకు తరగతులను ఏర్పాటు చేయ డం జరు గుతుందని పేర్కొన్నారు. ఎర్రబెల్లి ట్రస్టు సహకారం తో తరగతులను నిర్వహించడం జరుగుతుందన్నా రు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేయూత, ఎంప ీపీ జినుగు అనిమిరెడ్డి కృషి మరువలేనివని కొనియా డారు. ఈ సమావేశంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, ట్రైనర్ దిలీప్‌కుమార్, ప్రిన్సిపాల్ జయ కుమారి, తది తరులు పాల్గొన్నారు.