Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఎంపీఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రవీందర్
నవతెలంగాణ-మట్టెవాడ
గొల్లకురుమలకు గొర్రెల పంపిణీ పై రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని తెలంగాణ గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం (జీఎంపీఎస్)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ అన్నారు. తెలంగాణ గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం వరంగల్ జిల్లా కమిటీ సమావేశం ఎంజీఎం సెంటర్ జెడి కార్యాలయం దగ్గర జిల్లా అధ్యక్షులు నగరబోయిన సారంగం అధ్యక్షతన నిర్వహించడం జరిగిం ది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్ హాజరై మాట్లాడుతూ ప్రభుత్వం గొల్లకురుమలు అభివద్ధి చెందాలని గొర్రెల పంపిణీ కార్య క్రమం ప్రారంభించిందని గొర్రెల పంపిణీ మొదటి విడతలో గొల్ల కురుమల కంటే మధ్య దళారుల ఎక్కువ లబ్ధి పొందాలని ఆయన అన్నారు అవినీతి జరగకుండా ఉండాలంటే గొల్లకురుమలకు నేరుగాఅకౌంట్లోకి నగదుబదిలీ చేయాలని డిమాం డ్ చేస్తూ అనేక పోరాట ఫలితంగా ముడుగోడు నియోజకవర్గంలో నగదు బదిలీ కార్యక్రమం ప్రారంభించారని ఆయన అన్నారు.
మునుగోడులో గొల్ల కురుమల అకౌంట్లోకి నగదు బదులు చేసి అకౌంట్లు ఫీజింగ్ చేశారని ఫీజింగ్ తక్షణమే ఎత్తివేరని ఆయన డిమాండ్ చేశారు,నగదు బదిలీ కార్యక్రమం రాష్ట్రమంతటా అమలు చేయాలని లేనిపక్షంలోరాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. నగదు బదిలీ చేయకుంటే గొల్ల కురుమలుపోరాటాలకు సిద్ధంకావాలన్నారు. ఈసమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కాడబోయిన లింగయ్య, చల్ల మల్లయ్య, జిల్లా కార్యదర్శి పరికి మధుకర్, జిల్లా సహాయ కార్యదర్శి చెందు మల్లేష్, నగరబోయిన చిన్న నరసయ్య, జిల్లా కమిటీ సభ్యులు కంచె ఐలయ్య, గడ్డి రవి, నాంచారి కుమారస్వామి, జలిక లింగన్న, కవాటి సారయ్య, మేకల సమ్మయ్య, కొమ్ము రాజు తదితరులు పాల్గొన్నారు.