Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
నవతెలంగాణ-పరకాల
పరకాల నియోజకవర్గ కేంద్రంలో చేస్తున్న అభివృద్ధి పనుల్లో ఆలస్యం నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హెచ్చరించారు. శుశుక్రవారం పట్టణంలోని ఎంపీడీవో ఆవరణలో నూ తనంగా నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా సంబంధిత అధి కారులకు, కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్డింగుపనులను పూర్తి చేసేలా ప్రణాళిక ప్రకారం పనులు చేయాలన్నారు. బిల్డింగ్ నిర్మాణ పనుల్లో ఏమాత్రం నిర్లక్ష్యంచేసినా ఉపేక్షించబోనన్నా రు. అదేవిధంగా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రక్కన పాత తహసిల్దార్ కార్యాలయ ఆవరణంలో నూతనంగా నిర్మిస్తున్న తహసిల్దార్, ఆర్డీ వో కార్యాలయం భవనాలను పరిశీలించి సంక్రాం తి పండుగలోపు పనులను పూర్తి చేయాలన్నారు. అ భి వృద్ధి పనుల్లో నిర్లక్ష్యంగా అధికారులు, కాంట్రాక్టర్లు వ్యవహరిస్తే అట్టి వ్యక్తులు ఎంతటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ సోదాఅనితరామకృష్ణ, వైస్ చై ర్మన్ రేపూరి జైపాల్‌రెడ్డి, తహశీల్దార్ జగన్మోహన్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శేషు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.