Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గైర్హాజరైన అధికారులు - వెలవెలబోయిన కుర్చీలు
నవతెలంగాణ-పర్వతగిరి
మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవా రం మండల సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చాలా మం ది అధికారులు గైర్హాజరు కావడంతో తూతూ మంత్రంగా ముగించారు. ఎంపీపీ కమల అధ్యక్షతన నిర్వహించిన మండల సభలో ముందుగా సంబంధిత మండల అధికారులు తమ పనితీరును నివేదికల రూపం చదివి వినిపించారు. ఈ క్రమం లో అధికారుల పనితీరు పై పలు విమర్శలు చేస్తూ బాగోలేదని ఆయా గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిదులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రధానంగా విద్యాశాఖ,ఆరోగ్య శాఖ ల అధికారులు గైర్హాజరు కావడంతో స్థానిక జడ్పీటిసి బానోత్ సింగు లాల్ మండిపడ్డారు.అనంతరం వారికి మెమోలు జారీ చేయాలని,ఎంపిడిఓ చక్రాల సంతోష్ కుమార్కు సూచించారు.అలాగే చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్ దష్టికి తీసుకువె ల్తానని సింగు లాల్ తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారులు గైర్హాజరు కాకుండా మండల సభకు హాజరుకావాలని సూచించారు.అలాగే సమస్యల పరిష్కారం కోసం అధికా రులు,ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జడ్పీటిసి బానోతు సింగులాల్, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు,జిల్లా కో-ఆప్షన్ సభ్యుడు మహమ్మద్ సర్వర్,రైతు సమన్వయ కమిటీ మండ ల అధ్యక్షుడు చిన్నపాక శ్రీనివాస్,వివిధ శాఖల అధికారులు,ఆయా గ్రామాల సర్పంచ్ లు,ఎంపిటిసి లు పాల్గొన్నారు.