Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డైరెక్టర్ లక్ష్మీబాయిని కలిసిన చందర్రావు
నవతెలంగాణ-కాశిబుగ్గ
వరంగల్ వ్యవసాయ మార్కెట్ లో వ్యాపారులు రైతుల నుండి అదనపు కమి షన్, ముని, దానధర్మం తదితర పేర్లతో చేస్తున్న దోపిడిని అరికట్టాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోర్తాల చందర్ రావు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం తెలంగాణ రైతు సంఘం నాయకులు హైదరాబాదులో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా చందర్ రావు మాట్లాడుతూ వరంగల్ మార్కెట్ లో రైతులు తమ పంటలను విక్రయిస్తూ కోట్లాది రూపాయలు నష్టపోతున్న సందర్భంలో రైతుల గన్ని బ్యాగులకు వ్యాపారు లు రూ.30 చెల్లించాలని బై లా అమలు పరిచినందుకు కతజ్ఞతలు తెలియజే శారు. దీనివలన రైతులకు సుమారు రూ.10 కోట్ల వరకు న్యాయం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. అందుకు కషిచేసిన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులకు, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులకు కతజ్ఞతలు తెలియజేశారు. ఆసియాలోనే అతిపెద్ద రెండవ మార్కెట్ అయినా వరంగల్ వ్యవసాయ మార్కెట్ లో రైతులు విక్రయించే వాణిజ్య పంటలైన పత్తి మిర్చి పసుపు తదితర పంటలకు ఖమ్మం ఆదిలాబాద్ కేసముద్రం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లలో లభించే ధరల కన్నా ఇక్కడ క్వింటాకు రూ.200 నుండి 800 వరకు తక్కువ ధర చెల్లిస్తున్నారని తెలిపారు. ఆన్లైన్ తాక్ పట్టి, ఆన్లైన్ పేమెంట్ లను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం నాయకులు భాషిపాక రమేష్, బల్చకూర నర్సయ్య, సునీల్ పాల్గొన్నారు.