Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నీతిష్ వ్యాస్
నవతెలంగాణ-భూపాలపల్లి
పారదర్శకంగా ఓటరు జాబితా రూపొందించాలని కేం ద్ర సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నీతిష్ వ్యాస్ జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కేంద్ర సీని యర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నీతష్ వ్యాస్, రాష్ట్ర సీఈఓ వికాస్ రాజ్, 33 జిల్లాల ఎన్నికల అధికారులతో ఓట రు జాబితా సవరణ 2023 పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించారు. జిల్లా కలెక్టరేట్లోనే వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుం చి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొ న్నారు. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ మాట్లాడు తూ అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని, ఎన్ని కల కమిషన్ నిబంధనలను తూచ తప్పకుండా పాటించా లని ఆయన ఆదేశించారు. ఎన్నికల సమయంలో ఓట్ల తొల గింపు పై ఎలాంటి వివాదాలకు తావు లేకుండా, నిబంధన లను పకడ్బందీగా పాటిస్తూ క్షేత్రస్థాయి విచారణ తర్వాత మరణించిన వారిని, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లు రెండు సార్లు స్వీకరించుకొని జాబితా నుం చి తొలగించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల వివరాలు, ఓటరు జాబితాలో వస్తున్న అభ్యంతరా లు, నూతన ఓటర్ దరఖాస్తులు, ఓటర్ కార్డుల పంపిణీ, ఆధార్ కార్డు ఓటర్ ఐడి లింక్ చేయడం పై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. జిల్లాలో 17 సంవత్సరా లు నిండిన ప్రతి ఒక్కరూ తమ పేర్లు ఓటరు జాబితాలో నమోదు చేసుకోవచ్చని, 18 సంవత్సరాలు నిండిన తర్వాత వారికి ఓటు హక్కు లభిస్తుందని తెలిపారు. ప్రతి సంవత్స రం ఇక పై 4 సార్లు (జనవరి 1, ఏప్రిల్ 1,జూలై 1 అక్టోబర్ 1) ఓటర్ జాబితా అప్డేట్ అవుతుందని పేర్కొన్నారు. జిల్లా లలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఓటర్ల నుంచి ఆధార్ కార్డు వివరాలు తీసుకొని ఓటర్ ఐడికి లింక్ చేయా లని, ఆదేశాల ప్రకారం ఇది తప్పనిసరి కాదని,ఓటర్లు అభ్యం తరం లేకపోతే స్వీకరించాలని తెలిపారు. ఓటర్ నమోదు కార్యక్రమం పూర్తి పారదర్శకతో జరగాలని, ప్రతీ వారం నూతన ఓటర్ల నమోదు, ఓటర్ల వివరాలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతినిధులకు అందజేయాలని, జాబితా ప్రజలకు సైతం అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాల ని ఆయన సూచించారు. జిల్లాలో నూతనంగా జారీచేసిన ఓటర్ ఐడి కార్డులు వారికి అందే విధంగా పంపిణీ చేపట్టాల ని ఆయన సూచించారు. జిల్లాలో దివ్యాంగులు, సెక్స్ వర్క ర్లు, ట్రాన్స్ జెండర్లు వర్గాల్లో 18 సంవత్సరాల నిండిన వారందరికీ ఓటు హక్కు అందేలా కృషి చేయాలని ఆయన సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో పకడ్బందీగా ఓటు నమోదు రూపకల్పనకు అన్ని చర్య లు తీసుకున్నామని అన్నారు. జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన వారు సుమారుగా 16,170 ఉంటారని అంచనా వేసామని వీరిలో ఇప్పటివరకు 1069 ఓటు హక్కు కల్పిం చామని, జిల్లాలో ఉన్న 317 కేంద్రాలలో 1171 నూతన ఓటరు దరఖాస్తులు స్వీకరించామని కలెక్టర్ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 256351 ఓటర్లు ఉన్నారని, మహిళా పురుషుల ఓటర్ నిష్పత్తి 991 ఉందని అన్నారు. జిల్లాలో ఉన్న ఓటర్లలో మొత్తం 75.1% మంది నుంచి ఆధార్ వివరాలు సేకరించి అపడేట్ చేసామని అన్నారు.జిల్లాలో 10,014 నూతన ఓటర్ కార్డుల పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో మొత్తం 13883 పి.ఎస్.ఈ దరఖాస్తులు స్వీకరించి క్షేత్రస్థాయిలో ధ్రువీకరించ 6655 డూప్లికేట్ లు కనిపెట్టామని అన్నారు. ఓటరు జాబితా నుంచి క్షేత్ర స్థాయి విచారణ అనంతరం ఇప్పటివరకు మరణించిన 410 మంది, ఇతర ప్రాంతాలకు శాశ్వత వలస వెళ్లిన 936 మంది, రిపిటడ్ గా వచ్చిన 223, పి.ఎస్.ఈ 5819 మొత్తం 7388 తోలగించామని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఎలక్షన్ పర్యవేక్షలు అబ్బాస్, నవీన్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.