Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోటి రూపాయలతో సలహారం, రాజా గోపురం పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
నవతెలంగాణ-రేగొండ
మండలంలోన సుప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొడ వటంచ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ అభివద్ధికి కృషి చేస్తా నని స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. శుక్రవారం లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రాగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డికి పూర్ణకుంభం తో స్వాగతం పలికారు. అనంతరం లక్ష్మీనరసింహస్వామికి ఎమ్మెల్యే గండ్ర మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర మాట్లాడు భక్తుల ఇలవేల్పుగా పేరుగాంచిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి రానున్న రోజుల్లో ఆల య అభివద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే గండ్ర అన్నారు. భక్తుల సౌకర్యార్థం గెస్ట్ హౌస్లను నిర్మించామని అన్నారు. అలాగే ఈరోజు కోటి రూపాయలతో సలహారం, రాజగోపురం నాలుగు దిక్కుల ఉండే విధంగా నిర్మాణ పను లను ప్రారంభించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అధికారులు పనులను నాణ్యతగా పూర్తి చేయాలని అధికారులకు సూచిం చారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మాదాడి అనిత కరుణాకర్ రెడ్డి ఆలయ ఈవో శ్రీనివాస్ సర్పంచ్లు పబ్బ శ్రీని వాస్, రంజిత్ కుమార్, ఎంపిటిసి ఎర్రబెల్లి రవీందర్ రావు, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు అంకం రాజేందర్, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ మహేందర్, రైతు సమన్వయ సమితి మండల్ కోఆర్డినేటర్ మట్కా సంతోష్, జిల్లా కోఆప్షన్ సభ్యులు రహీం, టిఆర్ఎస్ జిల్లా నాయకులు ఉమేష్ గౌడ్చ కొలుగూరి రాజేశ్వరరావు పాపిరెడ్డి ప్రశాంత్ రావు,బిక్షపతి, రజినీకాంత్ పాల్గొన్నారు.