Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లాలో అడుగడుగునా పోలీస్ తనీఖీలు
నవతెలంగాణ-మహదేవపూర్
మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన పలిమెల మండలంలో జిల్లా ఎస్పి సురేందర్ రెడ్డి పర్యటించా రు కాటారం డిఎస్పి రామ్మోహన్ రెడ్డి, మహదేవపూర్ సిఐ కిరణ్తో పాటు మండలంలో శుక్రవారం పర్య టించారు. పిఎల్జిఏ వారోత్సవాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.ప్రజల అమాయ కత్వాన్ని ఆసరాగా చేసుకొని మావోలు తమ ప్రలోభా లకు గురిచేస్తూ వారికి సహకరించేలా చేస్తారని, అలాంటి చెడు మార్గంలో ప్రజలు పయనించవద్దని తెలిపారు. పలిమెల మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ను పరిశీలించి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేసారు. రాష్ట్రానికి సరిహద్దుగా పలి మెల మండలం ఉండటంలో మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు సూచించారు. మావోయిస్టు లు తెలంగాణలో ప్రవేశించే అవకాశాలు ఉన్నందున స్థానిక పోలీసులకు తగు దిశానిర్దేశం చేసారు. ఈ కార్యక్రమంలో ఎస్పి వెంట డిఎస్పి రామ్మోహన్ రెడ్డి, మహదేవపూర్ సిఐ కిరణ్ కుమార్, పలిమెల ఎస్సై అరుణ్ కుమార్ మరియు సిబ్బంది ఉన్నారు.
మొగుళ్ళపల్లి :పిఎల్జిఏ వారోత్సవాల నేపథ్యంలో ఎస్సై జె.శ్రీధర్ ఆధ్వర్యంలో శుక్రవారం మండలం లోని ప్రధాన రహదారిపై పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పిఎల్జిఏ వారోత్స వాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘట నలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
టేకుమట్ల : మావోయిస్టు వారోత్సవాల సంద ర్భంగా శుక్రవారం మండలంలో స్థానిక ఎస్సై చల్ల రాజు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మండలంలోని గ్రామాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరిస్తే పోలీసు లకు సమాచారం ఇవ్వాలన్నారు.
కాటారం:గ్రామ పంచాయతీలోని గంట గూడెం లో కాటారం డీఎస్పీ రామ్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కాటారం సిఐ రంజిత్ రావు, ఎస్సైలు సిహెచ్ శ్రీని వాస్, దాసరి సుధాకర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బం దితో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రంజిత్ రావు మాట్లాడుతూ మావోయిస్టులకు ఆశ్రయం కలిగించి నా, వారితో సంబంధాలు పెట్టుకున్న చట్ట ప్రకారం గా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని అన్నారు. కాటారం గ్రామస్తులు మావోయిస్టులు మా గ్రామా నికి రాకూడదని వస్తే సహించేది లేదని మావో యిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పలిమెల:మండలంలోని సర్వాయిపేటలో ఎస్సై అరుణ్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పి ఎల్జిఏ వారోత్సవాలు ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎస్సై అరుణ్ తో పాటు సివిల్ మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.
మల్హర్రావు : మావోయిస్టుల కదలికలపై ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని కాటారం డిఎస్పీ రామ్మోహన్రెడ్డి సూచించారు. జిల్లా పోలీసు ఉన్నతా ధికారులు ఆదేశాల మేరకు శుక్రవారం మండలం లో ని మల్లారం గ్రామంలో కమ్యూనిటి కాంట్రాక్టు కార్య క్రమాన్ని నిర్వహించారు. మావో యిస్టులకు, మావో ల సానుభూతిపరులకు ప్రజలు ఎవరు సహకరిం చొద్దన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ రంజిత్ రావు, ఎస్ఐలు సత్యనారాయణ, శ్రీనివాస్ సుధాకర్, రమేష్, సిఆర్పీ సిబ్బంది పాల్గొన్నారు.