Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీడియో సమావేశంలో మంత్రి హరీష్ రావు
నవతెలంగాణ - జనగామ కలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్రావు అన్నారు. మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ శ్వేత, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసు, హైదరాబాదు నుండి వైద్యశాఖ కార్యదర్శి సయ్యద్ అలీతో కలిసి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం 2023 జనవరి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జిల్లాల్లో గ్రామాలు, మున్సిపల్ లో వార్డుల వారిగా కంటి వెలుగు శిబిరాల షెడ్యూల్ను పంచాయతీ అధికారులు, మున్సిపల్ కమిషనర్, వైద్యశాఖ అధికారులు సమన్వయతో తయారు చేయాలన్నారు. జిల్లాలో జనాభాకు అనుగుణంగా అవసరమైన మేరకు బృందాలను సన్నద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతి బందంలో ఒక డాక్టరు, ఆప్తోమెటిస్టు, ఆశాలు, ఏఎన్ఎమ్ లు టాటా ఎంట్రీ ఆపరేటర్లు సిహెచ్ఓలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఏర్పాటైన బందాలకు వసతి సౌకర్యం ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు గ్రామాల్లో వార్డుల్లో శిబిరాలు ప్రారంభించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య మాట్లాడుతూ ..జిల్లాలో ఉన్న ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు మొత్తం 26 బృందాలను ఏర్పాటు చేస్తామని, జిల్లాలో ఇప్పటివరకు 26 మంది అర్హులైన ఆప్తమాలజిస్టులను నియమించామని తెలిపారు. అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మహేందర్, జిల్లా పంచాయతీ అధికారి వసంత, మున్సిపల్ కమిషనర్ రజిత తదితరులు పాల్గొన్నారు.
సుబేదారి : కంటి వెలుగు-2 కార్యక్రమంను అధికారులు సీరియస్ గా తీసుకోవాలని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ లో అన్నారు.మంగళవారంకంటి వెలుగు కార్యక్రమ అమలు ప్రణాళిక పై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ లు, అదనపు కలెక్టర్ లు, జిల్లా వైద్యాధికారులతో, జగిత్యాల కలెక్టరెట్ నుంచి వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ శ్వేత, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్, హైదరాబాద్ నుండి హాజరైన వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి తో రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. .రెండో విడత వంద వర్కింగ్ డేస్ లలో పూర్తి చేయాలన్నారు. కంటి వెలుగు2 కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులను క్రియాశీలక భాగస్వామ్యం చేయాలని అన్నారు. జిల్లాలో మైక్రో ప్లానింగ్ పూర్తి అయిన తర్వాత జిల్లా ఇంఛార్జి మంత్రి , స్థానిక ప్రజాప్రతినిధుల తో జిల్లా వారీగా మీటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. 3 కోట్ల మందిని స్క్రీన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని అన్నారు. 960 వైద్యులను వారం రోజుల్లోగా కొత్తగా నియమాకాలు చేస్తున్నాం అని, రెగ్యులర్ వైద్య ఆరోగ్య శాఖ కార్యకలాపాల కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. గ్రామ, మండల , జిల్లా స్థాయిలో కంటి వెలుగు -2 కార్యక్రమం పై విస్తత ప్రచారం నిర్వహించాలన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మున్సిపల్ కమీషనర్ ప్రవీణ్యా, అదనపు కలెక్టర్ సంధ్యా రాణి,డిపిఓ జగదీష్ ,జిల్లా వైద్య అధికారి సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.