Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర కమిషనర్ శంకర్
నవతెలంగాణ-గార్ల
ప్రభుత్వ పాలనలో పారదర్శకత కోసం ఆర్టిఐ 2005 చట్టాన్ని ప్రవేశపెట్టిందని దీని ద్వారా అధికారులలో జవాబుదారీతనం ఉంటుందని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ జి. శంకర్ నాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రం లోని డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ ఎ.నరసమ్మ అధ్యక్షతన సమాచార హక్కు చట్టం-2005 పై నిర్వహించిన అవగాహన సదస్సులో ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.ప్రతీ సామాన్య పౌరుడు ఈ చట్టం ద్వారా ప్రభుత్వ శాఖలలో అవినీతి జరగకుండా చూసేందుకు వీలు కల్పిస్తుం దని చెప్పారు. ఇప్పటి వరకు 39 వేల కేసులకు దరఖాస్తు లు రాక దాదాపుగా 37 వేల కేసులు పరిష్కారం చేశామని తెలిపారు. చదువు ద్వారానే జీవితంలో సార్దకత ఏర్పడుతుందని విద్యార్థులు కళాశాల స్థాయి నుండే నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఎంచుకుని ఆత్మవిశ్వాసం కలిగి పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు కషి చేయా లని అన్నారు. విద్య రంగంలో ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానంలో నిలవాలన్నారు. యువత స్మార్ట్ ఫోన్ లు, టీవీల మోజులో పడి విలువైన సమయాన్ని వృధా చేసుకో వద్దని సూచించారు. చెడు వ్యసనాలు, గుట్కా మత్తుపదార్థాలకు బానిసలు కాకుండా సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పారు. ముందుగా అంబేద్కర్ వర్దంతి సందర్భంగా అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కళాశాల కు వచ్చిన కమిషనర్ శంకర్ నాయక్ కు విద్యార్థులు పుష్పా గుచ్ఛం అందించి ఘనంగా స్వాగతం పలికారు. కళాశాల ఆధ్వర్యంలో అధ్యాపకులు శాలువాను కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు రాము,గార్ల-బయ్యారం సిఐ బాలాజీ, ఎస్సై బానోత్ వెంకన్న, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్ గోవిందరావు, అధ్యాపకులు, విద్యార్థులు ఉన్నారు.