Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూలి నాలి చేసి సంతానాన్ని తీర్చిదిద్దిన వైనం
- కుటుంబంలో ముగ్గురు వైద్యులు
- పుట్టు అంధురాలైన ఓ మహిళ విజయగాధ
- 2021లో పద్మశ్రీని కోరిన ఆమె కుమారుడు కల్నల్ బిక్షపతి
నవతెలంగాణ - జనగామ కలెక్టరేట్
కూలి నాలి చేస్తూ, దంచడానికి, విసరడానికి వెళ్లి, కూరగాయల విక్రయంతో పాటు తన కులవత్తి అయిన ఒట్టి చేపలు అమ్మతూ తన సంతానాన్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ఓ పుట్టు అందురాలైన మహిళ విజయగాధ. జీవితాన్ని విజయతీరాలకు చేర్చిన ఈ మహిళ ఎంతో మంది దివ్యాంగులకు, అం ధులకు స్ఫూర్తిగా నిలుస్తున్న వైనం. మిలిటరీ అదికారిగా రిటైర్ అయిన కుమారుడు డాక్టర్ కల్నాల్ మాచర్ల బిక్షపతి ఆమె విజయ గాధను వివరిస్తూ భారత ప్రభుత్వానికి పద్మశ్రీ ఇవ్వాలంటూ కోరడం విశేషం. జనగామ జిల్లా పాలకుర్తి మండలం బొమ్మెర గ్రామానికి చెందిన మాచర్ల కొమరమ్మ పుట్టు అంధురాలు అయినప్పటికీ జీవితంలో ఎక్కడా ఎప్పుడూ వెనకడుగు వేయకుండా, జీవితాంతం ఎవరి వద్ద చేయి చాచకుండా, ఎవర్ని ఏమి అడగ కుండా తన సంతానాన్ని విజయఠంలో నడిపించడం గమనాహరం. పుట్టూ అంధురాలైన కొమరమ్మ తన చెల్లెలు లక్ష్మిని తన భర్తకు కట్టబెడుతూ జీవితాన్ని విజయతీరాలకు చేర్చారు. తనకు తన సోదరికి కలిపి 7 సంతానం అయినప్పటికీ ఎక్కడ ఎవరి వద్ద చేయి చాచకుండా అందర్నీ విద్యావంతులుగా తీర్చిదిద్దారు. తన సంతానాన్నే కాకుండా మనవరాళ్లు రక్షిత, అధితి లను వైద్యులుగా సమాజం ముందు నిలబెట్టారు. అంతేకాకుండా తన కుమార్తె పసుల సుస్మిత పాలకుర్తి లోని కస్తూర్బా పాఠశాలలో పిఇటిగా పని చేస్తున్నారు. మరో కుమార్తె ప్రమీల సికింద్రాబాద్ లోని నాణేలు తయారు చేసే మింటు కంపెనీలో పనిచేస్తున్నారు.
23 ఏళ్లు దేశ సేవలో కుమారుడు
మాచర్ల కొమురమ్మ కుమారుడు డాక్టర్ కల్నాల్ మాచర్ల బిక్షపతి చిన్న వయసులోనే మిలటరీలో చేరి 23 సంవత్సరాలు దేశ సేవ చేశారు. వివిధ సంఘటనల్లో, వివిధ యుద్దాల్లో ఆయన సైనికులకు వైద్య సేవలు అందించారు. రెండు సంవత్సరాలు ఐక్యరాజ్యసమితిలో, ఆరు నెలలు నేపాల్ రాయ బాయ కార్యాలయంలో తన వైద్య సేవలు అందించి ఇటీవలనే పదవి విరమణ పొంది జనగామలో సిర పడ్డారు. అధితి పేరుతో బస్టాండ్ సమీపంలో వైద్య శాలను ప్రారంభించి సేవలందిస్తున్నారు. మాచర్ల బిక్షపతి ఇరువురు కుమార్తెలు రక్షిత, అధితి ఎంబీబీఎస్ చదవడంలో కొమరమ్మ పాత్ర వెల కట్టలే నిదని ఆమె కుమారుడు డాక్టర్ బిక్షపతి చెప్పారు. అందురాలైన తల్లి కొమురమ్మ సంతానాన్ని విజయ పదంలో నడిపించిన వైనాన్ని వివరిస్తూ డాక్టర్ బిక్ష పతి 2021లో భారత ప్రభుత్వానికి తన తల్లికి పద్మశ్రీ ఇవ్వాలంటూ కోరారు. ఎంతోమంది వికలాం గులకు, అందురాళ్ళకు స్ఫూర్తినిచ్చినతన తన తల్లి కొమరమ్మకు పద్మశ్రీ వచ్చేంతవరకు పోరాడుతూనే ఉంటానని డాక్టర్ కల్నల్ బిక్షపతి చెప్పారు.