Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ వల్లూరి పద్మ వెంకట్ రెడ్డి
నవతెలంగాణ - చిన్నగూడూరు
ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం మెరుగైన వైద్యం కోసం కషి చేస్తుందని ఎంపీపీ వల్లూరి పద్మ వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని ఉగ్గంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆస్పత్రి డెవలప్మెంట్ కమిటీని ఎన్నుకున్నారు. చైర్మన్ గా ఎంపీపీ పద్మా వెంకట్ రెడ్డి, కన్వీనర్ గా డిప్యూటీ డీఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ మురళీధర్, సభ్యులుగా పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ కరుణాకర్, జెడ్పీటీసీ సునీత మురళీధర్ రెడ్డి, ఎంపీటీసీ ఉదయమ్మ కొమురెల్లి, సర్పంచ్ పులమ్మ మల్లేష్, ఎంపీడీవో శ్యాంసుందర్, సూపర్వైజర్స్ వెంకటేశ్వర్లు, రాధా కుమారి, ఎంపికైనారు.