Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్) జిల్లా కౌన్సిల్ను జయప్రదం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి నందగిరి వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలో పూనెం బిక్షం అధ్యక్షతన మంగళవారం జరిగిన ముఖ్య కార్యకర్తల జనరల్ బాడీలో ఆయన పాల్గొని మాట్లాడారు. మోడీ ప్రభుత్వం రైతుల పంటలకు మద్దతు ధర చట్టం తీసుకొస్తానని హామీ ఇచ్చి సంవత్సరం దాటుతున్నప్పటికీ అమలు చేయలేదన్నారు. పంటకు మద్దతు ధర లేక దళారులు ఇష్టానుసారంగా రైతుల పంటలను దోపిడీ చేస్తున్నారని అన్నారు. చివరికి పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. పాలకుల ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని అన్నారు. రైతాంగానికి మద్దతు ధర చట్టం చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించు కోవాలని అన్నారు. రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని, ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కోరారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం అఖిల భారత రైతు కూలీ సంఘం నిత్యం పోరాడుతుందని, ఈ క్రమంలో అనేక విజయాలను సాధించడం జరిగిందని అన్నారు. ఈ క్రమంలోనే అఖిల భారత రైతుకూలి సంఘం జిల్లా జనరల్ కౌన్సిల్ తొర్రూర్ డివిజన్ కేంద్రంలో ఈ నెల 15 వ న నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు పూనెం బిక్షం, తోకల వెంకన్న, రామచంద్రుల మురళి, హౌలీ, రామకష్ణ, నరాల ఐలయ్య, భాష, పొడుగు వెంకన్న, గూగులోతు కిషన్, ఏసుదాసు, వీరబోయిన ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.ఫోటో ఉంది... యాడ్ ప్రీయార్టీ.