Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చ్రీఫ్విప్ దాస్యం, మల్లేపల్లి లక్ష్మయ్య
నవతెలంగాణ - హన్మకొండ
సమాజంలో ప్రతి ఒక్కరూ అంబేద్కర్ స్ఫూర్తిని ఆచరించాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు. మంగళవారం దీక్షా దివాస్ కార్యక్రమంలో భాగంగా హనుమకొండలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ ఆలోచన విధానం కెసిఆర్ ఆచరణ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్బగా చీఫ్ విప్ దాస్యం వినరు భాస్కర్ మాట్లాడుతూ.. ఏటా 11 రోజులపాటు ఈ దీక్ష దివాస్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. కెసిఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో'' అనే నినాదంతో అంబేద్కర్ ఆలోచనతో పేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి జరుగుతుందన్నారు. సమాజంలోకి అంబేద్కర్ వాదాన్ని తీసుకెళ్లాలన్నారు. విద్య, వైద్యం హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతుందన్నారు. ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించి గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, కార్పోరేట్ పాఠశాలలుగా మార్చిన ఘనత కేసిఆర్‌కు దక్కుతుందన్నారు. అనేక రెసిడెన్షియల్ పాఠశాలలను స్థాపించి, నాణ్యమైన విద్య, భోజనాన్ని అందిస్తున్నామన్నారు. వైద్య రంగంలో వరంగల్ జిల్లాలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. మెటర్నటీ, ఎంజీఎం, కఎంసి వైద్యశాలల్లో కొన్ని కోట్లతో ఆధునికరించి ఎంతోమందికి వైద్య సేవలు అందిస్తుందన్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కొన్ని వేల కోట్లతో నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో 120 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా కొత్తగా ప్రారంభించే సెక్రటే రియట్ కూడా అంబేద్కర్ పేరు పెట్టడం గర్వకారణం అన్నారు. నూతనంగా నిర్మించే పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టమంటే బీజేపీ ఒప్పుకోవడం లేదన్నారు. అనంతరం బుద్ధవనం ప్రత్యేక అధికారి, సెంటర్ ఫర్ దళిత సంఫ్‌ు అధ్యక్షుడు మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ.. ఆ కాలంలోనే హైదరాబాదును దేశ రాజధానిగా చేసి వరంగల్‌ను రాష్ట్ర రాజధాని చేయాలని అంబేద్కర్ తెలిపారన్నారు. అంబేద్కర్ బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నారు. ఆర్టికల్-3 ద్వారానే కొత్త రాష్ట్రం ఏర్పడిందని, ఆర్టికల్-17 ద్వారా అంటరానితనాన్ని నిర్మూలన, రాజ్యాంగం ద్వారానే అందరికీ ఓటు హక్కు లభించిందని, అందరికీ రిజర్వేషన్లు కల్పించిన ఘనత అంబేద్కర్‌కే దక్కు తుందన్నారు. ప్రజల మధ్య అసమానతలు తగ్గించే విధంగా ఆర్టికల్ 38, బలహీన వర్గాలకి ఆర్థిక విద్యాభివద్ధిలో ప్రభుత్వం చొరవ చూపాలని దిశా నిర్దేశం చేశాయని అన్నారు. దళిత బంధు పథకం ఇప్పటిది కాదని 1997లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దళిత జ్యోతి పథకాన్ని ప్రారంభించాడని అన్నారు. 2003లోనే టిఆర్ఎస్లో దళిత ఎజెండా అనే పుస్తకం ఉందని, సబ్ ప్లాన్ విషయాలు, దళిత బంధు, అణగారిన వర్గాలకు సమన్యాయం చేసే దిశగా దార్షనికతను చాటిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి అత్యున్నత స్థాయి అధికారుల సమా వేశం దళితుల అభ్యున్నతి కోసమే జరిగిందన్నారు. నిరుపేద, వ్యవసాయ ఆధారిత దళిత కుటుంబాలకే మూడెకరాల భూమి ఇవ్వాలనే పథకాన్ని తీసుకొచ్చారన్నారు. 2016లో 400 ఎస్సీ,ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్ పాఠశాలను ప్రారంభించారని అన్నారు. బిజెపి రాజ్యాంగ ఉల్లంఘన చేసి చట్టంలో మార్పు తీసుకొచ్చి డబ్బులు ఖర్చు పెట్టకపోతే మళ్లీ వచ్చే సంవత్సరం ఖర్చు పెట్టేలా కొన్ని నియమాలను సవరించిందన్నారు. సబ్ ప్లాన్‌లో రూ.1000 కోట్లు నాగార్జునసాగర్‌లో దళిత బంధుకు ప్రకటన చేయడం జరిగిందన్నారు. వాసాల మర్రి లో మొదటిసారిగా దళిత బంధును ఇచ్చారన్నారు. నిరంతరం అంబే ద్కర్ ఆలోచనను కెసిఆర్ ఆచరిస్తున్నారన్నారు. ప్రొఫెసర్ బన్నఐలయ్య, డా.రామచంద్రం, డా.మనోహర్,కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, అచ్చువ నియోజకవర్గ కన్వీనర్ జనార్ధన్, కార్పొరేటర్లు సోదా కిరణ్, లోహిత, దళిత నాయకులు వీరేందర్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.