Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
తొర్రూర్ పట్టణ కేంద్రంలో మంగళవారం ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 66వ వర్ధంతిని పురస్కరించుకొని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అన్నారం రోడ్డుకు గుడిసెలు వేసుకుని జీవిస్తున్న పేదల మధ్య, పట్టణంలోని స్థానిక ఉర్దూ మదర్సా అనాధ విద్యార్థుల మధ్య అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. టీఆర్ఎస్ యువజన విభాగ కార్యదర్శి విసంపల్లి బాలకృష్ణ పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పేద గుడిసె వాసులకు మరియు ఉర్దూ మదర్సా అనాధ విద్యార్థులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అంబేద్కర్ ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బచ్చలి వెంకన్న మాదిగ,ఎమ్మార్పీఎస్ తొర్రూర్ మండల ఇంచార్జ్ మందయాక మల్లు మాదిగ, మైనార్టీ జిల్లా నాయకులు మహమ్మద్ అమీర్, అంబేద్కర్ వాదులు బోళ్ల నర్సయ్య,హెచ్ యాకయ్య, బందు సంజీవ, రవి,చింత భాస్కర్ పాల్గొన్నారు.
నరసింహులపేట : మండలంలోని జయపురం గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 66 వర్ధంతి సందర్భంగా మందుల యాకుబ్ పల్లవి వ్యవసాయ క్షేత్రంలోని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడు అవుతాడని అన్నారు. దేశం గర్వించదగ్గ కవితలు, కథనాలు ప్రచురించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అన్నారు. ఆ మహానీయుడు పాదం మోపిన నెలలో తాను పుట్టడం గర్వంగా ఉందన్నారు.
పెద్దవంగర: ంబేద్కర్ మహాజ్ఞాన సంపన్నుడని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య అన్నారు. మంగళవారం స్థానిక ఎక్స్ రోడ్డు సమీపంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్పంచ్ లక్ష్మి, ఎంపీటీసీ శ్రీనివాస్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బిక్షపతి, పార్టీ అధ్యక్షుడు లింగమూర్తి, నాయకులు ఉపేందర్, అంజయ్య, సంజీవ, యాకయ్య, బాలు, కుమార్ పాల్గొన్నారు.
వివేకవర్ధినిలో...
కేసముద్రం రూరల్ : కేసముద్రం మండలంలోని శ్రీ వివేకవర్ధిని హైస్కూల్లో అంబేద్కర్ 66వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని అన్నారు.
లింగాలఘనపురం : అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నెల్లుట్ల గ్రామ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిట్ల ఉపేందర్ రెడ్డి , ఆగి రెడ్డి ,నెల్లుట్ల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జున్నుతుల సుధీర్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు మోటే వీరస్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ నల్ల రాహుల్, సీనియర్ నాయకులు నర్సింగ రామకష్ణ, నల్ల మైసయ్య,లింగ మూర్తి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు నల్ల అశోక్, నెల్లుట్ల 7వ వార్డ్ సభ్యులు గడ్డం యాదగిరి, మండల సంయుక్త కార్యదర్శి నల్ల కుమార్, 1వ వార్డ్ సభ్యులు ఢకొీండ రాజు, మండల సోషల్ మీడియా ఉపాధ్యక్షులు నల్ల విజరు, 10వ వార్డ్ సభ్యులు జగ్గం అశోక్, తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడ : భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహౌన్నత కీర్తి శిఖరం అంబేద్కర్ అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య కొనియాడారు. బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా మంగళవారం మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూలదండలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర బోయిన మొగిలి, ఎంపీపీ బానోత్ విజయ రూప్ సింగ్, కిసాన్ సెల్ మజ్దూర్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు రమేష్, సర్పంచ్ రణధీర్, నాయకులు రాజం సారంగం, వెంకటేశ్వర్లు,బోడ కోబల్, శంకర్, రేవంత్ పాల్గొన్నారు.
బచ్చన్నపేట : అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి ఆధ్వర్యంలో బచ్చన్నపేట చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించాఉ. రైతుబంధు జిల్లా అధ్యక్షులు ఇర్రి రమణారెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. దళితుల జీవితాల్లో వెలుగు నింపే దళిత బంధు పథకాన్ని అంబేద్కర్ స్ఫూర్తితో ప్రారంభించు కున్నామన్నారు.
దేవరప్పుల : అంబేద్కర్ స్ఫూర్తి ఆలోచనలను ఆశయాలను అమలు చేస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని టీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి సుడిగాల హనుమంతు అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దేవరుప్పుల మండల కేంద్రం ప్రధాన చౌరస్తా ప్రాంగాణంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భువనగిరి యాక స్వామి,తాటిపెల్లి మహేష్ గుండె రమేష్,గాదరి శ్రీకాంత్,కష్ణమూర్తి, యాకన్న,పరశురాములు, సోమయ్య, యాదగిరి, మంత అయిలయ్య,సత్తయ్య,నవీన్,కిరణ్, సంజీవ్,మధు, సామ్రాట్,రవి అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
గార్ల: బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్దంతి వేడుకలను వివిధ పార్టీ లు,దళిత సంఘాల అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్దానిక పోలీసు స్టేషను ఆవరణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎస్సై బానోత్ వెంకన్న, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగావత్ లక్ష్మణ్ నాయక్, అంబేద్కర్ విగ్రహ వ్యవస్థాపకులు నేతగాని నాగేశ్వరరావు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. వి.రాజశేఖర్,యం.శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
గ్రామ పంచాయతీ, వివిధ పార్టీల ఆధ్వర్యంలో
అంబేద్కర్ వర్దంతిని పురస్కరించుకుని స్దానిక అంబేద్కర్ విగ్రహానికి సర్పంచ్ అజ్మీర బన్సీలాల్,ఉప సర్పంచ్ కె.మహేశ్వరావు, సిపిఐ,సిపిఎం పార్టీల జిల్లా నాయకులు కట్టెబోయిన శ్రీనివాస్, కందునూరి శ్రీనివాస్ లతో కలిసి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కేవీపీఎస్, టీజేఎస్ నాయకులు సిహెచ్. ఎల్లయ్య, కె.ఎల్లయ్య, బి.హరి, వివిధ పార్టీల నాయకులు యం.గిరిప్రసాద్, వెంకన్న, ఎ.రామకష్ణ,ఎస్.నాగరాజు,శ్రీనివాస్,ఫరీద్ తదితరులు ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో
అంబేద్కర్ వర్దంతి సందర్భంగా స్దానిక అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. లో ఎంపిటీసి మాళోత్ వెంకట్ లాల్, నాయకులు టి.కష్ణ,షంషాద్ బేగం,రాము,వినోద, దేవ్ సింగ్,టిఆర్ఎస్ ఎస్ వి నాయకులు యాకూబ్ పాష తదితరులు ఉన్నారు.
నర్మెట్ట : నర్మెట్ట మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, వీహెచ్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ 66వ వర్ధంతిలి ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ మండల సీనియర్ నాయకులు కొంపెల్లి అంబేద్కర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ జనగామ జిల్లా నాయకులు గద్దెల కిషోర్, గండిరామారం సర్పంచ్ జ్వాలా శ్వేతా కిషన్ హాజరై ప్రసంగించారు. అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు చుంచు చరణ్, కనుకస్వామి, రామకష ప్రదీప్, వీహెచ్పీఎస్ నాయకులు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
లింగాలఘనపురం : ఎంఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి రాగల్ల ఉపేందర్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో అంబేద్కర్ 66వ వర్ధంతిరని ఘనంగా నిర్వహించి ఆయన విగ్రహానికి పూలమాల లేసి నివాళులు అర్పించారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ ఇన్చార్జి సందెన రవీందర్, వీహెచ్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం అంజయ్య తోకలిసి ఆయన మాట్లాడరాఉ. ఎమ్మార్పీఎస్ జనగామ జిల్లా కో కన్వీనర్ బొట్ల మహేష్, వీహెచ్పీఎస్ మండల కన్వీనర్ గడ్డం సోమరాజు, గౌరవ అధ్యక్షులు కుంటి వెంకటయ్య, నేతలు గట్టగల నర్సయ్య, ప్యాట భాస్కర్,ప్యాట మహేందర్, రాగల్ల ఆనంద్, కానుగంటి నాగరాజు, రమేష్, ముత్యాల అజరు, పాల్గొన్నారు.
కేసముద్రం రూరల్ : మండలంలోని అంబేద్కర్ సెంటర్లో కేసముద్రం మండల అంబేద్కర్ యువజన సంఘం కన్వీనర్ పోలేపాక నాగరాజు అధ్యక్షతన అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఎంపీపీ ఓలం చంద్ర మోహన్ పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరు అంబేద్కర్ ను స్మరించుకోవాలని, ఆయన ఆశయాలు నెరవేర్చాలన్నారు. కేసముద్రం స్టేషన్ సర్పంచ్ బట్టు శ్రీనివాస్, అంబేద్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మందుల కష్ణమూర్తి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి, అమీనాపురం సర్పంచ్ పురం రాజమణి-రమేష్, కేసముద్రం ఎంపీటీసీ మంజుల వెంకన్న కోరుకొండ పల్లి సర్పంచ్ నాగేల్లి జ్యోతి-శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు నజీర్ అహ్మద్ అంబేద్కర్ సంఘం పట్టణ అధ్యక్షులు ఆనందం, టీిఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వీరు నాయక్ , మండల కార్యదర్శి సంపెల్లి మల్లయ్య, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి జల్లే జయరాజు అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు సోమారపు మదర్ తదితరులు పాల్గిని నివాళులు అర్పించారు.
కొడకండ్ల : అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలో మంగళవారం ప్రభుత్వ కార్యాలయంలో అధికారులు ప్రజాప్రతినిధులు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు.
అందరి కోసం పోరాడిన వీరుడు అంబేద్కర్ : సీపీఐ(ఎం)
మరిపెడ: మరిపెడ మండల కేంద్రంలో సీపీఐ(ఎం), సీఐటీయూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం అంబేద్కర్ 66వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దుండి వీరన్న పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కొంతమంది విచ్చిన్నకారులు మతోన్మాదులు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర పన్నుతున్నారన్నారు. ప్రజా వ్యతిరేక విధానాల అవలంబిస్తున్న మతోన్మాదులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. మండల నాయకులు నందిపాటి వెంకన్న, బిల్డింగ్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండ ఉప్పలయ్య, సీఐటీయూ మండల కో కన్వీనర్ కాగిత రాంబాబు, మహిళా సంఘం మండల అధ్యక్షురాలు కాయిత కృష్ణవేణి పాల్గొన్నారు
అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం
బచ్చన్నపేట : మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి, ఎంఎస్ఎఫ్, విహెచ్పిఎస్, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ పైస రాజశేఖర్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెస్పీ జిల్లా నాయకులు అల్వాల నరసింగరావు, ఎంఎస్పీ మండల కో ఇన్చార్జ్ అలువాల రాజు, కాంగ్రెస్ నాయకులు నల్లగొని బాలకిషన్ గౌడ్, అల్వాల ఎల్లయ్య, ఎమ్మార్పీఎస్ టౌన్ ఉపాధ్యక్షులు సంపత్ మాదిగ, టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బాలరాజు మహేందర్ కైసర్, తదితరులు పాల్గొన్నారు.