Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాబూబాబాద్
అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా మహబూబాబాద్ మండలం శనిపురం గ్రామంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యక్షుడు ఆధర్యంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కోట కనుకయ్యతో కలిసి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంబేద్కరను ఆదర్శంగా తీసుకొని విద్యా ర్థులు ఉన్నతంగా ఎదగాలన్నారు. ఉచిత మెడికల్ క్యాంపు కన్వీనర్ డాక్టర్ గైనకాలజిస్ట్ నేతావత్ వెంకన్ననాయక్, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు చాగంటి ప్రభాకర్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత, దళిత బలహీన వర్గాల వికాసానికి పాటుబడిన మహానేత అంబేద్కర్ అన్నారు. స్పెషలిస్ట్ డాక్టర్ అమ భూక్య 100 మంది విద్యార్థులకు ఉచిత పరీక్షలు నిర్వహించి మందలు పంపిణీ చేశారు. ఉపాధ్యాయులు ఎండి రంజాన్ అలీ, వై కవిత, సిహెచ్ వెంకటరమణ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళీధర్ స్వామి, ఉపాధ్యాయినులు అనిత, మంజు భార్గవి, సువర్ణ, ఎస్ఎంసి చైర్మన్ వీరన్న, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు చాగంటి ప్రభాకర్ పాల్గొన్నారు.