Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనవరి 2న నీటి విడుదల
- కాలువల్లో అక్రమంగా మోటార్లు పెడితే చర్యలు తప్పవు
- ఈఈ వెంకట కృష్ణ
నవతెలంగాణ-వెంకటాపూర్
మండల పరిధి పాలంపేటలోని రామప్ప సరస్సు తైబందీ పూర్తిస్థాయిలో ఇవ్వనున్నట్లు ఈఈ వెంకట కృష్ణ తెలిపారు. 2022-23 సంవత్సరానికి యాసంగి పంటకుగాను ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ రైతులతో కలిసి బుధవారం పాలంపేటలోని రైతు వేదికలో సమావేశమయ్యారు. 5180 ఎకరాల ఆయ కట్టుకు పూర్తిస్థాయిలో నీరందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. జనవరి 2 వరకు పూడికతీత, చెత్తా చెదారాన్ని తొలగించి నీటిని విడుదల చేయాలని, ఇరిగేషన్ సిబ్బంది తక్కువ ఉన్నందున రైతులు పర స్పరం సహకరించాలని కోరారు. కాలువలలో ఎవరైనా అక్రమంగా మోటార్లు పెట్టి ఆయకట్టు రైతు లకు నష్టం కలిగిస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చ రించారు. కాలువలకు అక్రమ గండ్లు పెట్టినా , అడ్డు కట్టలు వేసినా, కాలువ గట్లు చెడగొట్టి సేద్యంలో కలు పుకున్నా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయక ట్టుదారులు 120 నుండి 130 రోజుల పరిమితి గల చిన్న వంగడాలను ఎంపిక చేసుకొని ధాన్యాన్ని పండించాలన్నారు. దీర్ఘకాల పరిమితి వంగడాలను ఎంపిక చేసుకొని నష్టపోవడమే కాకుం డా ఇతరులకు నష్టం కలిగించొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బుర్ర రజితసమ్మయ్య, తహసీల్ధార్ మంజుల, డీఈ రవీందర్ రెడ్డి, ఏఈలు శ్రీకాంత్, నారాయణ స్వామి, వర్క్ ఇన్స్పెక్టర్ దేవేందర్, రాము, వ్యవసా య విస్తరణ అధికారి కావ్య, తదితరులు పాల్గొన్నారు.