Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ ఎస్ క్రిష్ణ ఆదిత్య
నవతెలంగాణ-ములుగు
'మన ఊరు-మన బడి' కార్యక్రమం ద్వారా జిల్లాలోని ప్రతి మండలంలో నాలుగు పాఠశాలను ఈ నెల 15 నాటికి మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఎస్ క్రిష్ణ ఆదిత్య అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖ, ఈఈలు, డిప్యూటీ ఈఈలు, ఏఈలతో సమావేశమై కలెక్టర్ మాట్లాడారు. పాఠశాలల పునరుద్ధరణలో నాణ్యత ప్రమాణాలు పాటించి జిల్లాలోని 125 పాఠశాలల్లో మండలానికి నాలుగు పాఠశాలల చోప్పున అన్ని పాఠశాలల్లో విద్యూత్, మంచినీరు, ఫర్నీచర్, డిజిటలైజేషన్ తదితరవి సమకూర్చాలన్నారు. ప్రతి తరగతి గదిలో రన్నింగ్ బ్లాక్ బోర్డులను ఏర్పాటు చేయాలని, కిచేన్ షెడ్ లు, టాయిలెట్లు లను ఏర్పాటు చేయాలని, వాల్ పుట్టిని, పెయింటింగ్ పనులు, తది తరవి చేపట్టాలన్నారు. సానిటేషన్ పనులు సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. అనంతరం ప్రహరీలు, తరగతి గదుల్లో ఫ్లోరింగ్, అదనపు గదులు, మర మ్మత్తులు తదితర వాటి ప్రగతిని ఆన్లైన్ ద్వారా పర్య వేక్షించారు. పనులు జరిగి, ఆన్లైన్లో ఫోటోలు అప్లోడ్ చేస్తేనే డబ్బులు వస్తాయని, పనులు త్వరగా పూర్తిచేసి ఫోటోలను అప్లోడ్ చేయాలని అధికారులకు సూచిం చారు. డీఈఓ పాణిని, ఈఈలు హేమలత, వెంకటే శ్వర్లు, నరేందర్‌రెడ్డి, డిఈఈలు, నరసింహా చారి, రవీందర్, సంపత్, ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.
నిబంధనల మేరకు రేషన్ బియ్యం అందించాలి
వెంకటాపూర్ : రేషన్ కార్డ్ లబ్ధిదారులకు నిబంధనల మేరకే బియ్యం అందించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. బుధవారం వెంకటాపూర్ మండలం కేంద్రంలో సురేందర్ రెడ్డి చౌక ధరల దుకాణంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వినియోగదారులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకంగా బియ్యం పంపిణీ చేయాలన్నారు. రేషన్ దుకాణంలో నిబంధనల ప్రకారం బయోమెట్రిక్, విధానం ఐరిష్, మాస్టర్స్ స్టాకు సంబంధిత వివరాలను డీలర్‌ను అడిగి తెలుసు కున్నారు. అనంతరం వినియోగదారుల పౌర సేవల చార్ట్‌ను పరిశీలించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరుకులు పంపిణీి చేయాలన్నారు. అదనపు కలెక్టర్ వై వి గణేష్, జిల్లా సివిల్ సప్లై అధికారి అరవింద్‌రెడ్డి, తహసీల్ధార్ మంజుల, తదితరులు ఉన్నారు.