Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్
- రాష్ట్ర అధ్యక్షుడు పెండ్యాల దేవరాజ్
నవతెలంగాణ- తాడ్వాయి
రాష్ట్ర గిరిజన ఆశ్రమ హై స్కూల్ వర్కర్స్ సంఘం పిలుపుమేరకు కొన్ని రోజుల నుండి తాడ్వాయి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం జరుగుతున్న విషయం విధితమే. బుధవారం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పెండ్యాల దేవరాజ్ నిరసన తెలిపి మాట్లాడారు. ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న వర్కర్లను పర్మినెంట్ ఉద్యోగులుగా చేయాలని, సెలవులతో కూడిన మొత్తం 12 నెలల జీతం ఇవ్వాలని కోరారు. విధి నిర్వ హణలో మరణిస్తే బాధిత కుటుంబ సభ్యులకు ఒకరికి ఉద్యోగం కల్పించాలన్నారు. ఆరోగ్య బీమా సౌకర్యం, ఆరోగ్యశ్రీ కార్డులను అందిం చాలన్నారు. 2020 కరోనా లాక్ డౌన్ సమ యంలో జూన్ నుండి డిసెంబర్ వరకు పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హామీ ప్రకారం 30 శాతం పి ఆర్సిని వెంటనే అమలు చేయాలని, టైం స్కేల్ ఇవ్వాలని కోరారు. వారి డిమాండ్స్ నెరవేరే వరకు సమ్మె కొనసాగుతుందని అన్నారు. సమస్యల పరిష్కారానికి ఐటీడీఏ ఎదుట కూడా ధర్నా చేపడతామని తెలిపారు. ఈ కార్యక్ర మంలో వివిధ ఆశ్రమ హై స్కూల్ లో పని చేస్తున్న కార్మికులు, గిరిజన ఆశ్రమ హై స్కూల్ వర్కర్స్, తదితరులు పాల్గొన్నారు.