Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోత్ రవిచందర్
నవతెలంగాణ-ములుగు
దళిత బంధుపై జెడ్పీ చైర్మన్ జగదీష్ చేసిన ఆరోపణలో వాస్తవం లేదని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవిచందర్ అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన సమావేశం లో రవి చందర్ మాట్లాడుతూ.. దళితబంధుపై అధికార పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిష్పక్షపాతంగా జరుగుతున్నదని అన్నారు. కొంతమంది నాయకులు జీర్ణించుకోలేక ఆరోపణలు చేయడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ నాయకులు డబ్బులు తీసుకుంటున్న ఆరోపణలు అవాస్తవం అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లబ్ధిదారుల ఎంపిక ఎలా చేస్తున్నారో చూసి మాట్లా డాలని హితవుపలికారు. కాంగ్రెస్ నాయకులపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్,నియోజక వర్గ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వంశీ కష్ణ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కుక్కల నాగరాజు,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు దేవ్ సింగ్, పాల్గొన్నారు.
జెడ్పీ చైర్మెన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
గోవిందరావుపేట : కాంగ్రెస్ పార్టీ, నాయకులు, ఎమ్మెల్యే సీతక్కపై ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాం నాయక్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో గ్రామ అధ్యక్షులు రామచంద్రపు వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిధిగా సీతారాంనాయక్ హాజరై మాట్లాడారు. దళిత బంధు విషయంలో జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ కాంగ్రెస్ నాయకులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు అవాస్తవమన్నారు. టిఆర్ఎస్ లో అత్యున్నత స్థాయిలో, అత్యుత్తమ పదవిలో కొనసాగుతున్న జడ్పీ చైర్మన్ నిజాలు తెలుసుకోకుండా, నిరాధారంగా ఆరోపణలు చేయడం సమంజసం కాదని అన్నారు. ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడంతో కావాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆయన స్థాయిని తగ్గించుకునేలా వ్యాఖ్యానించడం సిగ్గు చేటన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణం గానే దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక జరిగిందన్నారు. లబ్ధిదారుల వద్ద రూపాయి కూడా ఆశించకుండా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేశామని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీష్ వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య సారయ్య, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్, జిల్లా నాయకులు కణతల నాగేందర్ రావు, సీనియర్ నాయకులు పాశం మాధవరెడ్డి, సూడి సత్తిరెడ్డి, మండల ఉపాధ్యక్షులు తేళ్ల హరిప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి వేల్పుగొండ పూర్ణ, మాజీ అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, పాలడుగు వెంకటకష్ణ, జెట్టి సోమయ్య, జంపాల చంద్రశేఖర్, భూక్య రాజు, కాడబోయిన రవి, చింత క్రాంతి, పడిగ పార్వతి, ఎంపీటీసీలు చాపల ఉమాదేవి- నరేందర్ రెడ్డి, గుండెబోయిన నాగలక్ష్మి- అనిల్ , గోపిదాసు ఏడుకొండలు, ధారావత్ పూర్ణ- గాంగు, సర్పంచులు, ఉపసర్పంచులు పాల్గొన్నారు.