Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ములుగు
కుమ్మరి సంఘం ములుగు మండల అధ్యక్షుడిగా ఓదెల శరత్ను నియమించినట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశాడపు దేవేందర్ తెలిపారు. బుధవారం ములుగు జిల్లా కేంద్రంలోని బొడ్రాయి వద్ద సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు ఆశాడపు దేవేందర్ హాజరై సంఘం మండల కమిటీనీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా శరత్ను నియమించారు. ఈ సందర్భంగా ఓదెల శరత్ మాట్లాడుతూ తనకు బాధ్యతలు అప్పగించిన జిల్లా అధ్యక్షుడు దేవేందర్, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, కోశాధికారి బాబు రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములపల్లి రాజు, ఓదెల రమేష్, కొత్తపల్లి బాబురావు, సముద్రాల స్వామి, వీరన్న, శనిగరపు గణేశ్, ఓదెల సాయితేజ, పాలడుగుల రాజు, గొల్లపల్లి శ్రీను, గొల్లపల్లి రాజు కుమార్, నాంపెల్లి దేవేందర్, నెల్లుట్ల సుమన్ తదితరులు పాల్గొన్నారు.