Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీ చైర్మన్ జగదీష్
నవతెలంగాణ - ములుగు
ములుగు జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు పాడి పరిశ్రమ ద్వారా ఆర్థిక స్వావలంభనకు సహకరించాలని రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ను ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ కోరారు. బుధవారం సోమ భరత్ కుమార్ ను ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ములుగు జిల్లాలో డైరీ డెవలప్మెంట్ కోసం సహకరించాలని, ఆదివాసీ గ్రామాలు కూడా ఎక్కువగా ఉన్నాయని, మినీ డైరీలు మహిళ సంఘాలకు ఉపాధి అవకాశాలు అందించాలని కోరారు ఆయన సానుకూలంగా స్పందిస్తూ ములుగు జిల్లాలోని పేద, మద్యతరగతి ఔత్సాహిక మహిళలను స్వయం సహాయక సంఘాలుగా ఏర్పాటు చేయాలని, వారికి మినీ డైరీలు అందే విధంగా చూస్తానని హామీనిచ్చినట్టు జెడ్పీ చైర్మెన్ తెలిపారు. ఇందుకు పైలెట్ ప్రాజెక్టుగా ములుగు జిల్లాలో మినీ డైరీలను ఏర్పాటు చేస్తానని సోమ భరత్ కుమార్ హామీనిచ్చారన్నారు.