Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏటూరునాగారం ఐటీడీఏ : యువత సేవా భావాన్ని అలవర్చుకోవాలని ఐటీడీఏ పీఓ అంకిత్ అన్నారు. డాక్టర్ బిడి శర్మ వర్ధంతి సందర్భంగా బుధవారం మండల కేంద్రంలోని గిరిజన భవన్లో తుడుందెబ్బ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఐటీడీఏ పీఓ అంకిత్ హాజరై ప్రారంభించి మాట్లాడారు. రక్తదానం మరొకరికి ప్రాణదానం అన్నారు. ఆపదలో ఉన్న తోటి వ్యక్తులకు సాయం చేయాలన్నారు. యువత చదువు తోపాటు సమాజ సేవ కూడా చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి రోజు ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాలని, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రక్తదాన శిబిరంలో సేకరించిన ప్యాకెట్లను స్థానిక సామాజిక ఆస్పత్రి ఆవరణ లోని బ్లడ్ బ్యాంక్‌కు అప్పగించనున్నారు. వైద్యులు స్వాతి, టీడబ్ల్యూటీయూ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పొదెం కష్ణప్రసాద్, తుడుందెబ్బ జాతీయ కోకన్వీనర్ పొడెం రత్నం, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు వావిలాల స్వామి, టీడబ్ల్యూటీయూ జిల్లా అధ్యక్షుడు నల్లబోయిన కోటయ్య, ఏటీఎఫ్ నాయకులు పొడెం ప్రసాద్, నల్లబోయిన సమ్మయ్య, తుడుందెబ్బ నాయకులు వంక నరేష్, కొటి రవి, పొలెబోయిన గోపాల్, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది మురళి, మల్లికాంబ, రమణ, నిర్మల పాల్గొన్నారు.