Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీడీఏ పీఓ అంకిత్
నవతెలంగాణ - ములుగు
గిరిజ చట్టాలు, హక్కుల సాధనకు పెసా కమిటీలు పనిచేయాలని ఏటూరు నాగారం ఐటీడీఏ పీఓ అంకిత్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో పెసా ఐటీడీఏ ఏటూరు నాగారం (ఉమ్మడి వరంగల్) జిల్లా కో-ఆర్డినేటర్ కొమరం ప్రభాకర్ అధ్యక్షతన పేసా గ్రామ కమిటీల సదస్సు నిర్వహించారు. అంకిత్ పాల్గొని బిడి శర్మ ఏడవ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూలమాలేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల కోసం బ్రహ్మ దేవ్ శర్మ (1929-2015) గిరిజన సంక్షేమం, అభివృద్ధికి జీవితంను అంకితం చేశార న్నారు. గిరిజన ప్రజల మనుగడకు కీలక సాధనంగా ఐదవ షెడ్యూల్ను జాతీయ ఎజెండాలోకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించా రన్నారు. ఆయన పదవీ విరమణ తర్వాత బిడి శర్మ భారత జన ఆందోళన్ ప్రజా ఉద్యమాల వేదిక స్థాపించారన్నారు. గ్రామాల్లోని పేసా మొబిలైజర్స్ వివిధ ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలనానరు. ఎన్ఆర్ఈజీసి, ఓటరు నమోదు, కమ్యూనిటీ రైట్స్, ఆర్ఓఎఫ్ఆర్ఓ తదితర వాటిపై అవగాన కల్పిస్తున్నారని, పరిశ్రమలు, భూములు మొదలైన సమస్యలపై గ్రామస్థాయిలో పేసా గ్రామ సభలు నిర్వహించి వారి అభివద్ధికి పాటుపడుతున్నారని పేసా మొబిలైజర్స్ ని కొని యాడారు. గిరిజన హక్కులు,చట్టాలు అమలుకు వారు పనిచేయాలని కోరారు. అనంతరం పేసా గ్రామ సభలను బలోపేతం చేయాలని,పేసా గ్రామ మొబిలైజర్స్ కు గౌరవ వేతనం ఇవ్వాలని, మండల కేంద్రంలో ఎంపీఓ,జిల్లా కేంద్రంలో డిపిఓ,ఐటీడీఏ పీఓలకు పేసా గ్రామ తీర్మానాలు ఇవ్వాలని నిర్ణయించారు. సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఈసం రాంమ్మూర్తి,మత్స్య శాఖ జిల్లా అధికారి శ్రీపతి,ఫీల్డ్ అధికారి రమేష్,జిసిసి డైరెక్టర్ పులుసం పురుషోత్తం,సర్పంచ్ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు ముద్దబోయిన రాము, పేసా మొబిలైజర్స్ మడి సాయిబాబు, చింత కృష్ణ, డబ్బుల ముత్యాలరావు, ఇరుప రాజు,కొమరం చంద్రయ్య,ఈక సురేందర్, సత్యం, తదతరులు పాల్గొన్నారు.