Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నవతెలంగాణ-రేగొండ
ఏళ్లతరబడి ప్రభుత్వ భూముల్లో కాస్తులో ఉంటు న్న రైతుభూములను సర్వేచేసి అర్హులైన వా రందరికీ పట్టాదారుపాస్పుస్తకాలు,మంజూరు చేస్తామని భూ పాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా క లెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. బుధవారం మండలం లోని రామన్నగూడెంలో సర్పంచ్ జంగిటి నరేష్ ఆధ్వ ర్యంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ముఖ్య అతి థులుగా హాజరై మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలు గా కాస్తు చేసుకుంటున్నా రైతులకు పట్టాలు లేక అనే క ఇబ్బందులకు ఎదుర్కొన్నట్లు, ఇప్పుడు ప్రభుత్వం అసైన్డ్ భూములకు సర్వే చేసి అర్హులైన వారికి పట్టా లు ఇచ్చేందుకు ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు వారు తెలిపారు. ఇందులో భాగంగానే ఈ రోజు రెవెన్యూసదస్సు నిర్వహించి గ్రామంలో అతిపె ద్దసర్వేనెంబర్లు 662, 663, వీటితోపాటు గ్రామం లో ఇంకా ఉన్న సర్వే నెంబర్లు గల భూమిని సర్వే చేసి అర్హులైన వారందరికీ పట్టాలు అందిస్తామని వా రు తెలిపారు. ఇందుకు అ నుగుణంగా గ్రామంలో ప్ర జలు సర్వేకు వచ్చిన సర్వే యర్లకు సంబంధిత అధికా రులకు పూర్తిగా సహకరిం చాలని ఒక ప్రణాళిక బద్ధం గా ఈ సర్వే నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. మీ గ్రామ భూ సర్వేపూర్తయ్యేవరకు ఒక సర్వే కమిటీ ఎన్నుకోవాలని ఆ కమిటీలో రైతులు, గ్రామవార్డు సభ్యులు, ఇంకె వరైనా ఉండవచ్చని అన్నారు. మీ భూమిలో సర్వే నిమిత్తం ముందుగా మేము గూగుల్ యాప్ ద్వారా మీరు సాగు చేస్తున్న భూమికి ఒక బౌండరీ గీసి మీకు ఇరువైపులా సాగులో ఉన్న రైతుల వివరాలను యాప్ ద్వారా పొందుపరిచి లబ్ధిదారున్ని సాగు భూమిలో ఉంచి ఒక ఫోటో తీసినట్లైతే ఆటోమేటిగ్గ మీ భూమి సాగు విస్తీర్ణం మీకు ఆన్లైన్లో కనబడుతుందని కలెక్టర్ అన్నారు. ఇందులో భాగంగా ముందుగా గ్రామంలో ఉన్న ఎక్కువ రైతులు సాగులో ఉన్న 662,663 సర్వే నంబర్లను సర్వేచేసి క్రమేపి మిగతా సర్వే నెంబర్లను కూడా ఈనెల 31వ తేదీ వరకు పూర్తి చేసి మీకు ప ట్టాదారు పాస్బుక్లు అందిస్తామని కలెక్టర్ పేర్కొన్నా రు. పట్టాదారు పాసుబుక్కులు రాగానే మీకు ప్రభు త్వం నుండి వచ్చే రైతుబంధు కూడా వర్తింప చేస్తామ ని కావున రైతులందరూ సర్వేకు వచ్చిన సంబంధిత అధికారులకు పూర్తి సహకారం అందించాలన్నారు.
అనంతరం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని పోడు భూములు, ప్రభుత్వ భూములలో ఏళ్ల తరబడి సాగు చేసుకున్నటువంటి రైతులందరికీ జిల్లా కలెక్టర్ ఒక ప్రణాళిక బద్ధంగా పో డుభూమి సర్వే ప్రభుత్వ భూముల్లోఏళ్ల తరబడి సా గులో ఉన్న రైతులందరికీ పట్టాదారు పాస్ బుక్కుల ను అందించేందుకు ఒక ప్రణాళిక రూపొందించడం జరిగిందని. ఈ నెలాఖరునాటికి భూసర్వే నిర్వహించి అర్హులైన ప్రతిరైతుకు పట్టాదారు పాస్బుక్ మంజూ రు చేసి వచ్చే కొత్త సంవత్సరం నుండి రైతుబంధు కూడావర్తింపచేస్తారని కావున రైతులందరూ సమన్వ యం పాటించి సమిష్టిగా ఈ భూ సర్వే నిర్వహించు కోవాలని సర్వేకు వచ్చిన అధికారులకు పూర్తిగా సహ కరించాలని రైతుల కోరారు .
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ శ్రీనివాస్, తహశీల్దార్ షరీఫ్, మండల ప్రత్యేక అధికారి శామ్యూల్, ఎంపి డిఓసురేందర్, ఎంపీపీ పున్నం లక్ష్మీ రవి, జెడ్పిటిస ిసాయిని విజయముత్యం,ఎంపిటిసి శనిగిరపు వెంక న్న, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు అంకం రాజేందర్ , సీనియర్ నాయకులు ఉమేష్ గౌడ్, సంతోష్ మధు సూదన రెడ్డి రమణారెడ్డి, శంకర్ లింగయ్య వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు, నాయ కులు తదితరులు పాల్గొన్నారు.