Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
రాష్ట్రంలో గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని సిపిఐ జిల్లా కార్య దర్శి కొరిమిరాజ్కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం సిపిఐ జాతీ యపార్టీ పిలుపుమేరకు గవర్నర్ వ్యవస్థను రద్దుచేయా లని చలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహిం చడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లా జయశం కర్ భూపాలపల్లి జిల్లా నుండి నాయకులు తరలి వెళ్లారు. కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్ లో ధర్నా నిర్వహిస్తుండగా సిపిఐ నాయకులను అరెస్ట్ అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో శాంతియుత వాతావరణంలో ధర్నా నిరసన తెలుపుతుంటే అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారు. అరెస్ట్ అయిన వారిలో సిపిఐ జాతీయనాయ కులు చాడ వెంకట రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనం నేని సాంబశివరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లిశ్రీనివాసరావు ఉమ్మడి వరంగల్ జిల్లాల కార్యదర్శులు విజయ సారధి,కోరిమి రాజ్ కుమార్,కర్రే బిక్షపతి,తోట మల్లికార్జున్ రావు లతో పాటు వెయ్యి మంది కార్యకర్తలను అరెస్టు చేశారు.