Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-టేకుమట్ల
అధికారులందరూ సమన్వయంతో పనిచేసి నూతన మండల అభి వృద్ధికితోడ్పడాలని స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిఅన్నా రు.బుధవారం మండలంలోని ఎ మ్మార్సీ భవనంలో ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన మం డల సర్వసభ్య సమావేశానికి ఎ మ్మెల్యే గండ్ర ముఖ్యఅతిథిగా హా జరయ్యారు.ఈసందర్భంగా గత మూడునెలల కాలంలో జరిగిన అభివద్ధి పనులపై పలుశాఖల అధికారులతో మాట్లాడించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులందరూ సకాలంలోకార్యాలయాలకు రావాలని, ప్రజాప్రతినిధులకు, ప్రజలకు అందుబా టులో ఉంటూవారికి ఎలాంటి సమస్యలు లేకుండా పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులకు అందేలా అధికారులు చూడాల న్నారు. అనంతరం మండలంలోని ఐదుగురు లబ్ధిదారులకు మంజూరైన రూ.2.48లక్షల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, తహ శీల్దార్ రామారావు, ఎంపీడీవో అనిత అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.