Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాయపర్తి
తెలంగాణ రాష్ట్ర సర్కారు విద్యార్థులకు సకల సౌకర్యా లు కల్పించడానికి మనఊరు-మనబడి పథకం ప్రవేశ పెట్టి విజయవంతంగా అమలు చేస్తుందని ఎంపీపీ జినుగు అని మిరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయా కర్రావు ఆదేశాల మేరకు రూ.41.62 లక్షల వ్యయంతో ని ర్మిస్తున్న డైనింగ్ హాల్, అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ మనఊరు-మనబడి పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో ఆధునీకరించడం జరుగుతుంది అన్నారు. దేశ నిర్మాణం తరగతి గదిలోనే పురుడుపోసుకుం టుందన్నారు. అందుకోసమే ప్రభుత్వ పాఠశాలలను ఉన్నతీ కరించాలని ప్రభుత్వం సంకల్పించి కోట్ల రూపాయలతో బ డులను అభివృద్ధి చేస్తుందని తెలిపారు. విస్తతమైన ప్రపం చానికి మన తరగతి గదులు అనుసంధానం చేయాల్సి ఉం దని.. ఈ మేరకు డిజిటల్ విద్యను పూర్తిస్థాయిలో ప్రభుత్వ బడులలో ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఈ పథకాన్ని మన ఊరు-మన బడి పేరుతో అమలు చేయడం సంతోషకరమన్నారు. మంత్రిఎర్రబెల్లి దయాకర్‌రావు సహ కారంతో మండలానికి అధిక నిధులు చేకూరుతున్నాయని దాంతో మండలం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రంగు కుమార్‌గౌడ్, రైతు బంధు కో-ఆర్డినేటర్ ఆకుల సురేందర్ రావు, గ్రామ సర్పం చ్ గారె నర్సయ్య, ఎంపీటీసీ ఐత రాంచందర్, ఏఈ వేణు, ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి, పార్టీ మండల ఉపాధ్య క్షుడు ఎండి.నయీమ్, తౌడిశెట్టి రామరావు, ముద్రబోయిన సుధాకర్, చందురామ్, ఉబ్బని సింహాద్రి, ఉపేందర్ తదిత రులు పాల్గొన్నారు.