Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దామెర
మహిళల అభివృద్ధే లక్ష్యంగా కేసీఆర్ పాలన సాగుతుందని ఎమ్మెల్యే చల్ల ధ ర్మారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ల్యాదెళ్లలో రూ.20 లక్షల నిధులతో మహిళా కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేసి రూ.20 లక్షలతో నిర్మించనున్న సీసీరోడ్డు నిర్మాణపనులను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమాy ేశంలో మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి షీ టీమ్స్, విహాబ్ కేసిఆర్ కిట్ వంటి అనేక వినూత్న కార్యక్రమాలను టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపా రు. మహిళలు భరోసాతో ఉంటేనే కుటుంబం అభివద్ధి చెందుతుందని అన్నారు. సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ లక్ష్యం లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తల్లి బిడ్డల సంరక్షణకోసం ప్రతిష్టాత్మకంగా కేసీఆర్కిట్ పథకం ప్రవేశపెట్టిం దన్నా రు. శ్రీనిధి పేరుతో పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలను స్వయం సహాయ గ్రూపుల కు మంజూరు చేస్తున్నామన్నారు. సమాజంలో సగభాగమున్న మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమఅభివద్ధి కార్యక్రమాలను చేపడుతున్న ట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మార్కెట్ కమిటీ లో కూడా మహి ళలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. లేదల్ల గ్రామంలో పల్లె దావఖాన నిర్మాణపనులకు రూ.20 లక్షల నిధులను వెచ్చిస్తామని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వ యంతో పని చేస్తూ ప్రజలను భాగస్వాములను చేయాలని అప్పుడే గ్రామాలు అ న్నిరంగాల్లో అభివృద్ధి చెందుతాయన్నారు. గ్రామాల అభివద్ధికి సీఎం కేసీఆర్ ఎన్ని నిధులైన కేటాయించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశ్వరరావు. ఎమ్మార్వో రియాజుద్దీన్. ఏపీ ఎం ఝాన్సీ, ఎంపీపీ కాగితాల శంకర్, జెడ్పీటీసీ కల్పనకృష్ణమూర్తి, గ్రామ సర్పంచ్ కుక్క శ్రావణ్యాఅనిల్. వైస్ ఎంపీపీ జాకీర్ ఆలీ. గండు రామకష్ణ .ఇతర నాయకు లు మహిళా సంఘాల సభ్యులు మహిళలు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.