Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధర్మసాగర్
గీత వత్తిపై శాస్త్రీయ పరిశోధనలు చేసి, ఆధు నీకరించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిం చడమే కాకుండా, వృత్తిపై గీత కార్మికులకు భరోసా కల్పించాలని గీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బాల్నే వెంకట్ నర్సయ్య కోరారు. ఇటీవల తాటి చెట్టుపై నుండి ప్రమాదవశాత్తు పడి మరణించిన పెద్ద పెండ్యాల గ్రామానికి చెందిన గీత కార్మికుడు మోడం ధనుంజయ గౌడ్ కుటుంబానికి తాడి కార్పొరేషన్ నుండి రూ.25 వేల చెక్కు మంజూరు కాగా గురువారం బీసీ కార్పొరేషన్ అధికారులు, తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ధనుంజయ గౌడ్ మరణం అతని కుటుంబానికే కాకుండా గీత కార్మికులందరికీ దిగ్భ్రాంతిని కలిగిం చిందన్నారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా బీసీ వెల్ఫేర్ అభివద్ధి అధికారి శంకరయ్య గౌడ్, హన్మకొండ జిల్లా కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షుడు గౌని సాంబయ్య గౌడ్, కార్యదర్శి మెరుగు వీరస్వామి, జిల్లా సహాయ కార్యదర్శి, మీడియా ఇంచార్జ్ బుర్ర శ్రీనివాస్ గౌడ్, బొనగాని యాదగిరి గౌడ్, కేజీ కేఎస్ జఫర్గడ్ మండల అధ్యక్షుడు గడ్డం రాజు, గీత పారిశ్రామిక సహకార సంఘం పెద్ద పెండ్యాల అధ్యక్షులు బత్తిని రవీందర్ గౌడ్, కోశాధికారి చిర్రా శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.