Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి పరిరక్షణకు కలిసి వచ్చే సంఘాలతో కలిసి పోరాటం
- ఐఎన్టీయూసీ నాయకులు బుచ్చయ్య
నవతెలంగాణ- కోల్బెల్ట్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పైపైకి లేనిపోని ఆరోపణలు చేసుకుంటూ అంతర్గతంగా ఒప్పం దాలు చేసుకొని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవే టుపరం చేస్తున్నాయని సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐఎన్టియుసి) భూపాలపల్లి బ్రాంచ్ ఉపాధ్యక్షులు జోగ బుచ్చయ్య ఆరోపించారు. గురువారం జయశంకర్ జిల్లా కేంద్రంలోని ఐఎన్ టీయూసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి పరిరక్షణకు ఐఎన్టియుసితో కలిసి వచ్చే కార్మిక సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని అన్నారు. కార్మిక వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న బిజెపి, టీఆర్ఎస్ ప్రభుత్వాలు రానున్న రోజుల్లో అడ్రస్ లేకుండా గల్లంతవుతాయని జోస్యం చెప్పారు. వేల కోట్ల రూపాయల లాభాలు తెస్తున్న సింగరేణి సంస్థ ను ప్రైవేటుపరం చేయాల్సిన అవసరం ఎందు కొచ్చిందని ప్రశ్నించారు. తెలంగాణలో బొగ్గు బ్లాకులు ప్రైవేటు పరం కావడానికి కారణం టీిఆర్ఎస్ సపోర్ట్ అన్నారు. మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశంలో టిఆర్ఎస్ ఎంపీలు ప్రైవేటుకు అప్పజెప్పడానికి తీర్మానం చేసిన ఫైల్ పై సంతకాలు చేశారని అన్నారు. సింగరేణి సంస్థలో 2014 నుండి అనేక విభాగాలలో అంచలంచెలుగా ప్రైవేటు కార్మి కులను తీసుకుందని, ఓసీలలో పంపులు, రకరకాల విభాగాలకు ప్రవేట్ వాళ్ళని తీసుకున్నారని అన్నారు. భూపాల పల్లిలో అతిపెద్ద గని కేటికె-8 లో 6 ఎస్డిఎల్ యంత్రాలు అండర్ గ్రౌండ్ లోకి దించిన ప్పుడు బీజేపీ, దాని అనుబంధ సంస్థ బీఎంఎస్ గాని, కార్పొరేట్ స్థాయిలో ఉన్న టిబిజికెఎస్ యూని యన్, ప్రాతినిధ్య సంఘం ఏఐటియుసి గాని పట్టిం చుకున్న సందర్భాలు లేవన్నారు. 1988లో సుమా రు లక్ష 20వేలమంది కార్మికులు ఉండగా ప్రస్తుతం 43 వేలకు తగ్గించబడిందన్నారు. ఇప్పటికైనా సిం గరేణి బ్లాకులను ప్రైవేటు పరం కాకుండా సింగ రేణికి అప్పగించకుంటే పోరాటాలు చేసి చేస్తా మన్నారు. రానున్న సింగరేణి ఎన్నికలలో ఐఎన్టి యుసిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర కమిటీ వైస్ ప్రెసిడెంట్ పసునూటి రాజేందర్, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ అండెం రఘుపతి రెడ్డి, బ్రాంచి నాయకులు బొడ్డు అశోక్, బి . మధుకర్ రెడ్డి, సిరంగి రాజయ్య, బానోతు రాములు, శనిగరపు శ్రీనివాస్, ఫిట్ కార్యదర్శులు బండి శ్రీనివాస్, పొనగంటి కష్ణ, సిహెచ్ గట్టు రాజు, తదితరులు పాల్గొన్నారు.