Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ
నవతెలంగాణ - హన్మకొండ
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి స్వరాష్ట్ర సాధనలో భాగస్వాములైన జర్నలి స్టులకు కులం మతంతో సంబంధం లేకుండా దళిత బంధు ఇవ్వాలని రైతుబంధు, దళిత బంధు తర హాలో జర్నలిస్టుబంధు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ కోరారు. గురువారం వరంగల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుండి రాష్ట్ర ప్రభుత్వంలో సమాచార శాఖకు ప్రత్యేక మంత్రులు లేకపోవడం దుర దృష్టకరమన్నారు. సమాచార శాఖ ముఖ్యమంత్రి వద్ద ఉండడం వల్ల జర్నలిస్టు సంఘాలు తమ సమ స్యలను ప్రభుత్వానికి నేరుగా చెప్పుకోవడానికి అవకాశం లేకుండా పోతుందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వంలో సమాచార శాఖకు ప్రత్యేక మంత్రిని ఏర్పాటు చేయాలని విన్నవించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జర్నలిస్ట్ సంఘాలతో ప్రతి ఆరు నెలలకు ఒకసారి వారి సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించాలని కోరారు. హెల్త్ కార్డులు పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకో వాలని 2014 టీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకారం జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలతోపాటు ఇల్లు కట్టించి ఇవ్వాలని కోరారు . జర్నలిస్ట్ భవన్ నిర్మాణం తదితర హామీలు రాష్ట్ర వ్యాప్తంగా పది శాతం కూడా అమలు కాలేదని అన్నారు. తమిళనాడు ,కేరళ ,కర్ణాటక రాష్ట్రాలలో రిటైర్మెంట్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం ఉందన్నారు. ఇదే తరహాలో తెలం గాణ రాష్ట్ర జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పిం చాలని డిమాండ్ చేశారు. దళిత బంధు తరహాలో మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ముఠా గోపాల్ వారి వారి పరిధిలో జర్నలిస్టు బంధు పథకాన్ని మంజూరు చేస్తున్నట్లు తెలిపారని, అన్ని నియోజకవర్గాల్లో ఇది అమలయ్యేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. జర్నలిస్టుల సమస్యలపై త్వరలో కేసీఆర్ కు లేఖ రాస్తానని అన్నారు. నూతనంగా ఏర్పాటైన మహాజన వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జాతీయ మహాసభలు ఫిబ్రవరి 23న హైదరాబాదులో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈలోగా అన్ని జిల్లాలలో నియోజకవర్గాలలో, మండల కేంద్రలలో పార్టీ నిర్మాణ కమిటీలను పూర్తి చేస్తామని చెప్పారు. ఎంఎస్పి రాష్ట్ర అధ్యక్షులు తీగల ప్రదీప్ గౌడ్ ,జిల్లా ఇన్చార్జి మందకుమార్, ఎంఆర్పిఎస్ కన్వీనర్ గద్దల సుకుమార్, ఎమ్ఎస్పీ జిల్లా కోఆర్డినేటర్ బండారు నరేందర్, మంద భాస్కర్ ,మంద రాజు, బొక్కల నారాయణ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.