Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-గోవిందరావుపేట
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో గురువారం మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా సంబరాలు జరుపుకొని బాలసంచా కాల్చారు. గోవిందరావుపేట గ్రామ కమిటీ అధ్యక్షుడు రామచంద్రపురం వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా సీతారాంనాయక్ మాట్లాడుతూ ఈ గలుపుతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఆనందోత్సాహల్ని నింపిందని అన్నారు. ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే తొలి విజయంగా ప్రజల్లో మార్పు మొదలైందని అన్నారు. ప్రజల మార్పుకు ప్రధాన కారణం రాహుల్ గాంధీ జోడో యాత్ర అన్నారు. రాబోవు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ దేశంలో, రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడం ఖాయమని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య సారయ్య, యూత్ కాంగ్రెస్ జిల్ ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్, జిల్లా నాయకులు కణతల నాగేందర్ రావు, మండల ఉపాధ్యక్షులు తేళ్ల హరిప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి వేల్పుగొండ పూర్ణ, జెట్టి సోమయ్య, జంపాల చంద్రశేఖర్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు భూక్య రాజు, సర్పంచ్ లావుడియ లక్ష్మీజోగనాయక్ పాల్గొన్నారు.