Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు
నవతెలంగాణ-మల్హర్రావు
వైద్యుల నిర్లక్ష్యంగా మృతి చెందిన స్వర్ణపల్లి గ్రామానికి చెందిన తొట్ల మాధవి కుటుంబానికి న్యాయం చేయాలని జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. గురువారం బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మాధవి మృతిపై విచారణ చేపట్టి, ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకొని, బాధితురాలు కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలంటూ పెద్దపల్లి కలెక్టర్, జిల్లా వైద్యాధికారికి లేఖ ద్వారా ఫిిర్యాదు చేశారు. మంథని ప్రభుత్వ మాత శిశు ఆస్పత్రిలో ప్రసూతి సేవ కోసం ఈనెల 7న మాధవి అడ్మిట్ అయిందని ప్రసూతి వైద్యులు, అనస్థీషియా డాక్టర్, ఇతర నర్సులు చికిత్స నిమిత్తం ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లి ఇంజక్షన్లు వేసిన తర్వాత పిట్స్ వచ్చిందని, పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారన్నారు. దీంతో మార్గమధ్యములోనే తోట్ల మాధవి చనిపోయిందని వైద్యుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారన్నారు. పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. రాత్రి నుంచి కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్దే ఉంటున్నారని వెంటనే పోస్టుమార్టం చేయాలన్నారు.