Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా సంక్షేమ అధికారి ఈపి ప్రేమలత
నవతెలంగాణ - ములుగు
కౌమార దశలో పిల్లల్లో వచ్చే మార్పుల్ని తల్లిదండ్రులు గమనించి అవగాహన కల్పించాలని జిల్లా సంక్షేమ అధికారి ఈపీ ప్రేమలత అన్నారు. గురువారం బాలవికాస కమ్యూ నిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా కెనడా ఫండ్ ఫర్ లోకల్ ఇనిటియాటివెస్ వారి ఆర్థిక సహాయంతో పైలెట్ ప్రాజెక్టుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న 25 ట్రైబల్ స్కూల్స్ ఎంపిక చేసి వారికి 'నెలసరి పై అవగాహన- లైంగిక పునరుత్పత్తి ఆరోగ్యం, హక్కులు' అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఒక్కో పాఠశాలకు ఏడుగురితో కమిటీ వేసి వారికి శిక్షణ ఇచ్చారు. సానిటరీ పాడ్ బర్నింగ్ మిషన్, పొల్యూషన్ అరికట్టేందుకు మొక్కలు అందించారు. ఇందులో భాగంగా గురువారం ములుగు గిరిజన భవన్లో 120 మంది అంగన్వాడీ టీచర్లకు, ఆశా కార్యకర్తలకు ఎంఎస్డబ్ల్యూ ఎంఏ రూరల్ డెవలప్మెంట్ ప్రొఫెషనల్ రామకృష్ణ శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా ప్రేమలత మాట్లాడుతూ.. ప్రస్తుత సమా జంలో వ్యక్తిగత బంధాలు, విలువల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. వికాస ప్రోగ్రాం మేనేజర్ తాతిరెడ్డీ మంజుల మాట్లాడుతూ.. పరిశుభ్రతపై అవగాహన కల్పిం చారు. కౌన్సిలింగ్ ఫిజికలోజిస్ట్ కుసుమ రమేష్ ఎస్టిడి,ఎస్టిఐ గురించి వివరించారు. డీపీహెచ్ఎన్ఓ శకుంతల, వసంత, పాల్గొన్నారు.