Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహదేవపూర్
ఈ నెల 2వ తేదీ నుండి గురువారం వరకు మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ వారోత్సవాలు జరుపు కోవాలని పిలుపునివ్వడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనన జరగకుండా ప్రశాంతంగా నిర్వహిం చారు. పలిమెల, కాలేశ్వరం పోలిస్ స్టేషన్లను ఎస్పీ సురేందర్‌రెడ్డి, ఓస్డీ గౌస్ ఆలం, కాటారం డీఎస్పీ రహమోరెడ్డి సందర్శించారు. వారోత్సవాల సందర్భం గా పోలీసులకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశిం చారు. దీంతో వారం రోజుల పాటు అటవీ ప్రాంతాల్లో నిత్యం కూంబింగ్‌తోపాటు వాహనాల తనిఖీలు చేపట్టారు. గొత్తికోయ గుడాల్లో కమ్యూనిటీ ప్రోగ్రాం లు ఏర్పాటు చేశారు. నక్సలైట్లు, మావోయిస్టులకు ఆశ్రయం ఇవ్వవద్దని హెచ్చరించారు. నిత్యం డీఎస్పీ ఆధ్వర్యంలో మహాదేవపూర్ సీఐ కిరణ్, మహాదేవపూర్ కాలేశ్వరం, పలిమెల ఎస్ఐలు రాజకుమార్, లక్ష్మణ రావు, అరుణ్ తనిఖీలు చేపట్టారు. ప్రజల్లో మావోయిస్టులపై అవగాహన కల్పించారు.ప్రభుత్వం కల్పిస్తున్న అభివృద్ధి పథకాలపె ౖప్రజలకు వివరించారు. మావోయిస్టులకు సహకరించొద్దని గ్రామాలో సభలు ఏర్పాటు చేసి వివరించారు. ఏది ఏమైనా వారోత్సవాలు ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు, ప్రజాప్రతినిధులు ఊపిరి పీల్చుకున్నారు.