Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దామెర కిరణ్ కోరారు. గురువారం స్థానిక డీఈఓ ముద్దమల్ల రాజేందర్‌ను కలిసి వినతి పత్రం అందజేసి ఆయన మాట్లాడారు. శ్రీ చైతన్య కార్పొరేట్ పాఠశాలలో ఫీజులదోపిడీ అధికంగా పెరిగి పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. మెటీరియల్ పేరిట దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఫీజులు కట్టలేదనే సాకుతో విద్యార్థుల్ని ఎర్రటి ఎండలో నిలబెట్టడంతోపాటు విద్యార్థులు పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. పాఠశాలలో విద్యా ర్థులకు మౌలిక వసతులు కల్పించకుండా సక్రమంగా తరగతులు నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహ రి స్తున్నారని అన్నారు. ఇరుకు గదుల్లో విద్యాబోధనతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఒక్కో ఉపాధ్యాయుడికి 10మంది విద్యార్థులను కేటాయించి ఫీజులు వసూలు చేయాలని టార్గెట్ పెడుతూ ఒత్తిడికి గురిచేస్తున్నారన్నారు. శ్రీ చైతన్య పాఠశాల గుర్తింపు రద్దు చేయకుంటే ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఈ కార్యక్ర మంలో జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరి రాజు, బొడ్డు స్మరణ, జిల్లా సహా కార్యదర్శి సంపత్ రెడ్డి, బొడ్డు కిషోర్ ,విజరు, శేఖర్, రాజు తదితరులు పాల్గొన్నారు.