Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏటూరునాగారం ఐటీడీఏ
ఐటీడీఏ ఇంజనీరింగ్ ద్వారా చేపట్టిన భవన నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉన్నా యని, సకాలంలో పూర్తి చేయాలని ఇంజి నీరింగ్ అధికారులను ఐటీడీఏ పీఓ అంకిత్ ఆదేశించారు. గురువారం ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐటీ డీఏ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఈఈ, డీఈ, ఏఈ, టీఏలతో సమీక్షించి ఆయన మాట్లాడారు. పీఎంఆర్సీ మరమ్మతు పనులు, డీఆర్ డిపోలు, సబ్ సెంటర్ భవనాల నిర్మాణం, వరంగల్, హన్మకొం డలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణ పనులు, బాస్కెట్ బాల్, వాలీబాల్ కోర్టుల పనులు పురోగతిలో ఉండాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నాణ్యత విషయంలో రాజీ లేకుండా పనులు చేయించాల న్నారు. ప్రారం భమైన ప్రాథమిక పాఠశాలల సివిల్ పనులు, ఆట వస్తువుల సేకరణ, బీటీ రోడ్ల ఏర్పాటు, మోడల్ అంగన్ వాడీ కేంద్రాలు, మహబూబా బాద్ జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరమ్మతు పనుల్లో జాప్యం లేకుండా చూడాల న్నారు. పాఠశాలల్లో మన ఊరు-మన బడి పనులు ఆలస్య మవుతున్నాయని డీఈ నవీన్‌పై మండిపడ్డారు. కొనసాగుతు న్న పనులన్నీ 2022 జనవరి 2వ వారంలోపు పూర్తి చేయా లన్నారు. టెండర్ ద్వారా ఖరారు చేసిన పనులు వచ్చే వారంలోపు ప్రారంబించాలన్నారు. ములుగు, మహబూబా బాద్ జిల్లాల్లో నెలాఖరులోగా టీడబ్ల్యూ విద్యా సంస్థల్లో సివిల్ పనులన్నీ మిషన్ మోడ్‌లో పూర్తి చేయించాలని చెప్పా రు. సంబంధిత డీఈ, ఏఈలు పనుల్ని పర్యవేక్షించాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటుకల తయారీ, సెంట్రింగ్ యూనిట్, కాంక్రీట్ మిక్సర్ తదితర అర్హతగల లబ్ధిదారులకు ఎంఎస్ ఎంఈ ప్రోగ్రామ్ కింద నిర్దిష్ట యూనిట్లు మం జూరయ్యాయని, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ లో ఉపయో గించేందుకు అవసరమైన, ముడి సరుకును సేకరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఈ హేమలత, డీఈలు నవీన్‌కుమార్, సంపత్‌కుమార్, రామ్‌రెడ్డి, ఏఈఈలు దేవిశ్రీ, ప్రణిత, వసంత్, అబీద్‌ఖాన్, చందర్రావు, రాము, రవి, టీఏ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.