Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఈఓ పాణిని
నవతెలంగాణ-ములుగు
ఈనెల 7న ప్రారంభమైన జిల్లాస్థాయి రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం రెండో రోజు గురువారం విజయవంతంగా కోలాహలంగా నిర్వహించినట్టు ములుగు డీఈఓ పాణిని తెలిపారు. మొదటి రోజు రిజిస్ట్రేషన్ చేసు కున్న ప్రాజెక్టుల ప్రదర్శనను జిల్లాలోని పలు పాఠశాలల విద్యార్థులకు శాస్త్రీయ దక్పథంపై వివరించారు. ఇన్స్పైర్ పథకంతో పాటు రిజిస్ట్రేషన్ చేసుకున్న 260 ఎగ్జిబిట్లు రెండవ రోజు ప్రదర్శింపబడ్డాయి. ములుగు ,వెంకటాపూర్, గోవిందరావుపేట మండలాలకు చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులు హాజరై ఎగ్జిబిట్లను తిలకించారు. ఇదే స్ఫూర్తితో తమ పాఠశాలల్లో కూడా ఎగ్జిబిట్లను తయారుచేసి ప్రదర్శిస్తామని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రదర్శనలను ఎంపిక చేయడానికి ఇతర జిల్లాల నుండి వచ్చిన న్యాయ మూర్తులు ప్రదర్శనలను పరిశీలించి విజేతలను ఎంపిక చేసినట్టు డీఈఓ తెలిపారు. జిల్లా సైన్స్ అధికారి అప్పని జయదేవ్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరిని పెం పొందించడానికి, నూతన ఆవిష్కరణలు రూపొందించ డానికి వైజ్ఞానిక ప్రదర్శనలు ఉపయోగపడతాయన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు ఉపయోగపడేలా ప్రదర్శనలు తిలకించేలా సహకరించాలని కోరారు. డీసీఈ బీ కార్యదర్శి విజయమ్మ, విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ బద్దం దర్శన్ రెడ్డి, కోఆర్డినేటర్-3 రమాదేవి, మండల విద్యా శాఖ అధికారులు సురేందర్, దివాకర్, సాంబయ్య, వెంకటే శ్వర్లు, ట్రస్మా ములుగు జిల్లా అధ్యక్షులు పోశాల వీరమల్లు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కందాల రామయ్య, వివిధ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు ప్రధానో పాధ్యాయులు, విద్యావేత్తలు పాల్గొన్నారు.