Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
మన ఊరు-మనబడి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. టిఎస్ఈడ బ్ల్యూఐడిసి చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య సంచాల కులు శ్రీదేవసేనతో కలిసి 33జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్ధేశం చేశారు. మొదటి దశలో చేపట్టిన 9123 పాఠశాలలో 30 లక్షల కంటే అధిక వ్యయం ఉన్న పాఠశాలలో 15శాతం మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయన్నారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్ర తినిధులతో సమన్వయం చేసుకుంటూ నామినేషన్ పద్ధతిలో సదరు పాఠశాల పనులు చేపట్టాలని సూ చించారు. ప్రతి మండలంలో రెండు మాడల్ పాఠ శాలలను ఎంపిక చేసుకున్నామని, డిసెంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1200 పాఠశా లలను ప్రారంభించేందుకు సన్నద్దం చేయాలని సూచించారు. 10శాతం గ్రీన్ బడ్జెట్ వినియోగిస్తూ పచ్చదనం పెంపోందెలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మన ఊరు మనబడి పనుల వివరాలు అందిస్తే వెంటనే నిధులు విడుదలవుతాయన్నారు. గడిచిన వారం రోజుల్లో రూ.100 కోట్లు విడుదల చేసామని అన్నారు. సెంట్రల్ పూలింగ్ విధానం ద్వారా ఇక పై చెల్లింపులు జరుగుతాయన్నారు. పాఠశాలలకు అవసరమైన ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డ్ వచ్చే వారం జిల్లాలకు వస్తాయని, వాటిని మాడల్ పాఠశాలలకు పంపిణీ చేయాలని ఆదేశించారు. పాఠశాలల నిర్వహణ కోసం ప్రభుత్వం 130 కోట్లు విడుదల చేసిందని, వాటిని సమర్థవంతంగా వినియోగిస్తూ పారిశుధ్యం, టాయిలెట్స్ నిర్వహణ లో ఇబ్బందులు రాకుండా పర్యవేక్షించాలన్నారు. ప్రతి జిల్లాలో గ్రంథాలయ ఏర్పాటుకు అనువైన ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేయాలని సూచించారు. టీఎస్ఈడబ్ల్యూఐడిసి చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాల పెయింటింగ్ నిబంధనల ప్రకారం పకడ్బందీగా జరిగేలా చూడాలన్నారు. రూ.30 లక్షల కంటే అధికంగా ఖర్చు జరిగే పాఠశా లలకు టెండర్లు రాకుంటే స్థానిక ఎమ్మెల్యే సహకారంతో నామినేషన్ ద్వారా పనులు ప్రారంభించాలన్నారు. కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ జిల్లాలో 22 మోడల్ పాఠశాలలో నరేగా పనులు మాత్రమే పెండింగ్ ఉన్నాయని డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేసి ప్రారంభానికి సన్నద్దం చేస్తామన్నారు. జిల్లాలో 149 పాఠశాలలో 30 లక్షల కంటే అధికంగా ప్రతిపాదనలు ఉన్న 8 పాఠశాల టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. అదనపు కలెక్టర్ టి.ఎస్.దివాకర, జిల్లా విద్యాశాఖ అధికారులు, విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి, మండల నోడల్ అధికారులు పాల్గొన్నారు.