Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆత్మకూర్
మహిళల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతుందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని కటాక్షపూర్ గ్రామంలో రూ.20లక్షలతో మహిళ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం సర్పంచ్ మచ్చిక యాదగిరి అధ్యక్షతన నిర్వహించిన సమా వేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. మహిళల సంక్షేమం, అభ్యున్నతికి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సీఎం కేసీఆర్ పాలన దేశంలోనే ఆదర్శ వంతంగా నిలిచిందని అన్నారు. మహిళలు మగవారి మీద ఆధారపడకుండా కష్టంతో ఎదుగుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజల సమస్యలు తెలుసుకుని సమస్యలు పరిష్కారించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మార్క సుమలత-రజినీకర్,టిఆర్ఎస్ మండల అధ్యక్షులు లేతాకుల సంజీవరెడ్డి,రైతు బంధు అధ్యక్షులు రవీందర్, ఏఎంసీ చైర్మన్ రాధారవి, వైస్ ఎంపీపీ సుధాకర్ రెడ్డి,జిల్లా నాయకులు దుంపలపల్లి బుచ్చిరెడ్డి, కక్కెర్ల రాజు,సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు కమల రాజేశ్వర్, ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షులు అర్షం వరుణ్ గాంధీ, నీరుకుళ్ళ సర్పంచ్ బలరాం, ఏపీఎం లలిత, మండల ప్రధాన కార్యదర్శి బొల్లోజు కుమార్ స్వామి, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.