Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
కుగ్రామంగా ఉన్న భూపాలపల్లి అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని పేద, మద్యతరగతి ప్రజల సౌకర్యార్థం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం భూపాలపల్లి పట్టణం 5 ఇంక్లెన్ కమాన్ సమీపంలో నూతనంగా రూ.2 కోట్లతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ఎమ్మెల్యే మాటాడారు. రెండెకరాల్లో సంబంధిత పనులను ప్రారంభించినట్టు తెలిపారు. ఫంక్షన్ హాల్, డైనింగ్ హాలుతో పాటు అధిక ఉష్ణోగ్రతలు తట్టుకు నేందుకు ఏసీలు అందుబాటులో ఉంచి అంబేద్కర్ కమ్యూనిటీ హాల్‌గా నామక రణం చేస్తున్నామని ప్రకటించారు. పనులు పూర్తయిన వెంటనే అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఆరు నెలల్లో పనులు పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లు, ఇంజనీర్లను ఆదేశించారు. మునిసిపల్ గెస్ట్ హౌజ్ కు ఎకరం స్థలం కేటాయించామని, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలోనే భూపాలపల్లి జిల్లా అభివృద్ధిలో ముందు వరుసలో ఉందని స్పష్టం చేశారు. వంద పడకల ఆసుపత్రి సేవలను మహరాష్ట్ర ప్రజలు కూడా పొందుతున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెడికల్ కళాశాలను కూడా మ ంజూరుచేశామని, త్వరలోనే సింగరేణి కార్మికుల నివాసానికి వేయి క్వార్టర్స్ అందుబాటులోకి వస్తున్నాయన్నారు. అభివృద్ధి, సంక్షేమంపై రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు. మునిసిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి, మున్సిపల్ కమిషనర్ పి అవినాష్, మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్ కుమార్ యాదవ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్ధన్, కౌన్సిలర్లు బద్ధి సమ్మయ్య, మేకల రజిత, కురిమిళ్ల రజిత, ఆకుదారి మమత. ముంజాల రవిందర్ గౌడ్, సజ్జనపు స్వామి, గండ్ర హరీష్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సెగ్గం సిద్ధు, విద్యాసాగరెడ్డి, రాజుతో, ఆర్డబ్ల్యూంఎస్ డీఈ రమేష్ ఏఈ అవినాష్, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్రకు రుణపడి ఉంటాం : మోకిడి అశోక్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ భవనానికి అంబేద్కర్ పేరు నామకరణం చేసినందుకు, అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పిన ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డికి రుణపడి ఉంటామని టీఆర్ఎస్ భూపాలపల్లి అర్బన్ అధ్యక్షుడు మోకిడి అశోక్ అన్నారు. జిల్లా కేంద్రంలో సింగరేణి కమ్యూనిటీ హాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం తరఫున మరో కమ్యూనిటీ హాల్ ఉండాలనే లక్ష్యంతో కమ్యూనిటీ హాల్ నిర్మించడం సంతోషకరమన్నారు. దళితుల అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీ ఆర్ దళితబందు అందిస్తున్నారన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే సహకారంతో రానున్న రోజులలో దళితులు మరింత అభివృద్ధి చెందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ ఎస్సీ సెల్ అర్బన్ నాయకులు గోగుల మదన్మోహన్, రేళ్ళ కుమార్, సేగ్గం రామయ్య, వెంబడి కోటేశ్వర్, ఆకునూరు సదానందం, సిగ్గం రాజసమయ్య పాల్గొన్నారు.