Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నర్సంపేట
ఆయా గ్రామసభల్లో తిరస్కరించబడిన అటవీ హక్కుల పత్రాల దరఖాస్తులపై తిరిగి సర్వే చేపట్టి హక్కుపత్రాలు అందజేయాలని వ్యకాస వరంగల్ జిల్లా కార్యదర్శి భూక్య సమ్మయ్య డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (వ్యకాస) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఏవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2005 అటీవీ హక్కుల చట్టం ప్రకారం పోడు సాగు చేసుకుంటూ దళిత గిరిజన ఇతర పేదలు ఏండ్లుగా జీవిస్తున్నారనన్నారు. 2005కు ముందు భూమిపై కేసులో ఉన్న భూమిపై ఉన్న వారందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని అ్నఆ్నరు. ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో ఒక్కరికి కూడా హక్కు పత్రం ఇచ్చిన పాపాన పోలేదని అన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు హక్కు పత్రాలు ఇవ్వకుండా అటవీ సంపదను డబ్బున్నోడికి కట్టబెట్టడం కోసం ప్రయత్నిస్తుందని విమర్శించారు. జిల్లాలో సుమారు 11,000 మంది దరఖాస్తులు తీసుకోగా సుమారు 3000 దరఖా స్తులు తిరస్కరించారన్నారు. గ్రామ సభలకు అధికారాలు ఇవ్వకుండా ఫారెస్ట్ అధికారులు మొత్తం రద్దు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. డివిజన్ స్థాయి కమిటీ ఆర్డీవో సమక్షంలో దరఖాస్తు చేసు కున్న హక్కు పత్రాలపై సమీక్షించి అర్హులను గుర్తించాల్సి ఉందన్నారు. ఫారెస్ట్ అధికారులు చెప్పిందే పరిగణంలోకి తీసుకొని రెవెన్యూ యంత్రాంగం హక్కు పత్రాల జాబితాను తయారు చేయడం సరైంది కాదన్నారు. నెక్కొండ చెన్నారావు పేట మండలాల్లో సూరిపల్లి లింగగిరి తండాలో లింగాపురం కోనాపురం గ్రామాల్లో రైతులు సేద్యం చేసుకున్న భూములను లాక్కునేందుకు ఫారెస్ట్ యంత్రాంగం ప్రయత్నం చేస్తుందని, ఆ భూము లను సర్వే చేయాలన్నారు. లేదంటే పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలం గాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఈసంపెల్లి బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నమిండ్ల స్వామి, జిల్లా ఉపాధ్యక్షులు ఈదునూరి వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షురాలు మొగులూరు శారద, నాయకులు మల్లయ్య, మారంపల్లి ప్రభాకర్, మైదం మాణిక్యం, మాదారపు కేశవులు, కంకల నరసయ్య, కొట్టే మల్లేష్, మొగిలి, తదితరులు పాల్గొన్నారు.