Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్
దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. గురు వారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రపంచ దివ్యాంగుల వారోత్సవాల సందర్భంగా జాతీయ గ్రా మీణ ఉపాధి హామీ పథకం, పట్టణ పేదరిక నిర్మూ లన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విభి న్న ప్రతిభావంతుల, దివ్యాంగుల వారోత్సవాల సంద ర్భంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, స్వ యం సహాయక సంఘాలలో దివ్యాంగులకు అందు తున్న సేవలు, సౌకర్యాల గురించి ఆయన అధికారు లను అడిగి తెలుసుకున్నారు. మానసిక వికలాంగు లకు సదరం సర్టిఫికెట్, వీల్ చైర్లు, పెన్షన్ సౌకర్యం పంపిణీ చేయడంలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నడవ లేని స్థితిలో ఉన్న వారికి ఫిజియో థెరపీ, వైద్యం అం దించడంలో నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ వహించి సేవ లందించాలని ఆదేశించారు. మెప్మా ఆధ్వర్యంలో ది వ్యాంగుల స్వయం సహాయక గ్రూపులు 44 ఏర్పాటు చేసినట్లు, అందులో 8 సక్రమంగా నడుస్తున్నట్టు చె ప్పారు. మిగతా గ్రూపులను యాక్టి వేట్ చేయడానికి అవగాహన కార్యక్రమాలు, ప్రచారం నిర్వహించాలని కోరారు. దివ్యాంగుల సమస్యల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేసి, సమస్యలను పరిష్కారం చేస్తున్నట్లుగా తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో భాగంగా చేపట్టే పల్లె ప్రగతి, ప్రకతి వనాలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, నర్సరీలలో వారు చేయదగిన పనులు కల్పించాలని చెప్పారు. దివ్యాం గులు ఈజీ ఎస్ పనులు చేసిన దినాలకు చెల్లింపులు వెంటనే చెల్లించాలన్నారు. ఈజిఎస్ 100 రోజుల పనుల్లో ఎక్కువ పని దినాలు పనిచేసిన దివ్యాం గులను సన్మా నించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశారు, డిఆర్డిఏ పిడి రాంరెడ్డి, జిల్లా వెల్ఫేర్ అధికారి జయంతి, ఏపీడి నూరుద్దీన్, డిపి ఎంలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.