Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేసముద్రంరూరల్
గెలుపోటములు సహజం... ఓటమి చెందిన క్రీడాకారులు కుంగి పోవద్దు... గెలిచిన క్రీడాకారులు మురిసిపోవద్దు... ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నా రు. కేసముద్రం మండల కేంద్రం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన 41వ సీనియర్ షూటింగ్ బాల్ స్టేట్ ఛాంపిన్షిప్ క్రీడా ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్విజేతలకు బహుమతులు అందజే శారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ యువకు లు ఒంటరిగా ఉండటం... చదువులతో ఒత్తిడి... ఏదో తెలియని వెలితి... ఇవన్నీ నేడు యువతి యువకుల్లో కనబడుతున్నాయి. వీటన్నింటిని తట్టుకోవాలంటే ఆటలు తప్పనిసరి ఆడాలి, మనం ఆటలకు దూరంగా ఉంటున్నామంటే మన అందమైన బాల్యం నుంచి దూరంగా ఉండటమేనని అన్నారు. క్రీడలతో ఏకాగ్రత కూడా పెరుగుతుందని, శారీరక ఎదుగుదల ఆటల్లో చురగ్గా ఉండటం వల్ల నీర సం రాదు అని అన్నారు. స్త్రీల విభాగంలో మొదటి బహుమతి సూర్యాపేట జిల్లా కైవసం చేసుకున్నారు. పురుషుల విభాగంలో సంగారెడ్డి జిల్లా మొదటి బహు మతిని కైవసం చేసుకోవడం జరిగింది. ఈ రెండు జట్లకు శాసనసభ్యులు శంకర్ నాయక్ బహుమతి ప్రధానోత్సవం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కేస ముద్రం జడ్పిటిసి రావుల శ్రీనాథ్ రెడ్డి షఉటింగ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసు, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి నీలం దుర్గేష్, క్రీడా కారులకు షీల్డ్ దాత సతీష్, టౌన్ అధ్యక్షులు వీరు నాయక్ కే చంద్ర మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నజీర్ అహ్మద్ కాంప్లెక్స్ హెచ్ఎం శాంతాబాయి, షఉటింగ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వ్యాయామ ఉపా ధ్యాయుడు అలీష్ కుమార్, కేసముద్రం స్టేషన్ ఎంపీటీసీ ఆగే వెంకన్న మంజుల మండల ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ , క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.