Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
హిందూ దేవాలయాలకు దేవత విగ్రహాలకు రక్ష ణ కావాలంటూ ఆదివారం మండల కేంద్రంలో అ య్యప్ప స్వాములు163వ జాతీయ రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వా ములు మాట్లాడుతూ రాత్రి తాహసిల్దార్ కార్యాల యం వెంట ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప విగ్రహాన్ని ధ్వంసం చేశారని తెలిపారు. ధ్వంసం చేసిన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హిందూ దేశంలో దేవాలయాలకు దేవత విగ్రహాలకు రక్షణ కరువైందని అన్నారు. ఇకనైనా భక్తులకు దేవత విగ్రహాలకు దేవా లయాలకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో భద్రత కల్పిం చాలని అయ్యప్ప స్వాములు డిమాండ్ చేశారు. జాతీ య రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో స్థానిక పసర పోలీస్ స్టేషన్ ఎస్ఐ సిహెచ్ కరుణాకర్ రావు సంఘటన స్థలానికి చేరుకొని స్వాములతో మాట్లాడి రాస్తా రోకోను విరమింప చేశారు.
విగ్రహాలు ధ్వంసం కాలేదు...
వాస్తవంగా మండలంలో ఎలాంటి విగ్రహాలు ధ్వంసం కాలేదని అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు కొందరు తెలిపారు. అయ్యప్ప స్వామి ఆల య నిర్మాణానికి పక్కనే అంబేద్కర్ కమ్యూనిటీ హాలు నిర్మాణం కోసం ఐదు గుంటల స్థలాన్ని ప్రభుత్వం గత పది సంవత్సరాల క్రితం కేటాయించడం జరి గిందన్నారు. ఇటువంటి స్థలంలో కూడా అయ్యప్ప దేవాలయ నిర్మాణాలను చేపడుతున్న నేపథ్యంలో గ్రామంలో యువజన సంఘం యువకులు తమ భూమిని తాము స్వాధీనం చేసుకోవడం జరిగింద న్నారు. ప్రస్తుతం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్రభు త్వం 30 లక్షల రూపాయలు వెచ్చించడం జరిగిందని అందుకు కేటాయించిన స్థలంలో అంబేద్కర్ కమ్యూ నిటీ హాలు నిర్మిస్తామని తెలిపారు.
కఠిన చర్యలు తీసుకోవాలి : బిజెపి
మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్నటు వంటి అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గర ఉన్నటు వంటి హిందూ దేవతామూర్తుల యొక్క విగ్రహాలను ధ్వంసం చేసినటువంటి వారిపై కఠిన చర్యలు తీసు కోవాలని భారతీయ జనతా పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు చింతలపూడి భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో సంఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిత్యం పూజలు చేస్తున్నటువంటి దేవాల యం పైన కొంతమంది దుండగులు ఉద్దేశపూర్వకం గానే షెడ్‌ని కూల్చివేసి అందులోని విగ్రహాలని రోడ్డు పైన పడి వేయడం దుర్మార్గమైన చర్య అని, కావాలని కొంతమంది మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టా లనే దురుద్దేశంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని ,వారి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నింది తులను శిక్షించే వరకు ఆందోళన కార్యక్రమాలు చేప డతామని వారు హెచ్చరించారు.అనంతరం గోవింద రావుపేట బిజెపి మండల అధ్యక్షులు మద్దినేని తేజ రాజు ఆధ్వర్యంలో స్థానిక పస్రా ఎస్సై కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపా ధ్యక్షులు ఏనుగు రవీందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్య దర్శి నగరపు రమేష్, జిల్లా కార్యదర్శి కర్ర సాంబశివ రెడ్డి, బీజేవైఎం అధ్యక్షులు కొత్త సురేందర్, మండల అధ్యక్షులు మద్దినేని తేజ రాజు, వాసుదేవారెడ్డి రాకేష్ యాదవ్, మెరుగు సత్యనారాయణ,సామల శ్రీనివాస్ కార్మిల శ్రీనివాస్ వంగూరి వెంకటరమణ, గుర్రం వేణు బద్దం జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.