Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
కల్లుగీత కార్మిక సంఘం 65 ఏళ్ల ఉద్యమ యా త్ర కార్యక్రమం హైదరాబాద్‌లోని సుందరయ్య కళా నిలయంలో ఈనెల 13వ తేదీన నిర్వహిస్తున్నట్లు కల్లు గీత కార్మిక సంఘం నేతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ మాత్యులు వి.శ్రీనివాస్‌గౌడ్, వివిధ సంఘాల రాష్ట్ర నాయకులు హాజరవుతున్నారు. రాష్ట్ర నలు మూలల నుండి సంఘం నాయకులు, గీతకార్మికులు హాజరు కావాలన్నారు.1957లో మొదటి రాష్ట్ర మహాసభ జరుపుకొని 65 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా నాటి నుండి నేటి వరకు సంఘం చేసిన పోరాటాలు సాధించిన విజయాలు నెమరు వేసుకొని భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నామని తెలిపా రు. సంఘంలో పనిచేసి అమరులైన వారి కుటుం బాలకు ఆత్మీయ సన్మానం,నూతనరాష్ట్ర కమిటీ సభ్యు లకు అభినందన కార్యక్రమం, సావనీర్ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని నేతలు తెలిపారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు యం.వి.రమణ,గోప మహ బూబాబాద్ డివిజన్ అధ్య క్షులు చిలువేరు సమ్మన్న, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యమగాని వెంకన్న గౌనీ వెంకన్న, గౌరవ సలహాదారులు గుడిగంటి మోహన్, కేసముద్రం మండల కార్యదర్శి రాష్ట్ర కమిటీ సభ్యులు మోడెం వెంకటేశ్వర్లు, పానుగంటి వీరస్వామి, గుండ గాని లింగన్న, కొత్త అంతయ్య మొగుళ్ళ, యాకన్న, ముంజల వీరస్వామి, గంధం వెంకన్న, రాగిపిల్లి వెంకటేశ్వరు,్ల ఓరుగంటి వెంకన్న వివిధ గ్రామాల సొసైటీ అధ్యక్షులు గీతా కార్మికులు పాల్గొన్నారు.
ఏఐకేఎంఎస్ కౌన్సిల్ జయప్రదం చేయ్యాలి....
ఈనెల 15న తొర్రూర్‌లో జరుగు అఖిలభారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా జనరల్ కౌన్సి ల్ జిల్లా జనరల్ కౌన్సిల్‌ను జయప్రదం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ ఆధ్వ ర్యంలో కేసముద్రం మండలం అంబేద్కర్ సెంటర్లో గోడపత్రిక ఆవిష్కరణ చేయడం జరిగింది. కార్యక్ర మంను ఉద్దేశించి ఏఐకేఎంఎస్ మండల బాధ్యులు అన్నారపు హనుమంతు, బట్టు వెంకన్నలు మాట్లాడు తూ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల్ని, మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించు కోవ డం కోసం జిల్లా జనరల్ కౌన్సిల్ నిర్వహిస్తున్నాం జన రల్ కౌన్సిల్లో ముఖ్య వ్యక్తులుగా సిపిఎంఎల్ న్యూడె మోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఆవు నూరి మధు, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి.కోటేశ్వరరావు మం డల వెంకన్న తదితరులు ప్రసంగిస్తారు. కావున రైతులు కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని జనరల్ కౌన్సిల్‌ను జయప్రదం చేయవలసిందిగా కోరారు. గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో మండల నా యకులు చంద్రమౌళి పాషా అశోకు సరస్వతి వెంకన్న తదితరులు పాల్గొన్నారు
వ్యాకాసా మహాసభలను జయప్రదం చేయండి...
బయ్యారం : ఖమ్మంలో డిసెంబర్ 29, 30, 31 తారీఖులలో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం 3వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని, మహా సభకు ముఖ్య అతిథిగా కేరళ ముఖ్యమంత్రి పీనరన్ విజయన్ హాజరవుతున్నారని, డిసెంబర్ 29 న భారీ ప్రదర్శన బహిరంగ సభలో ప్రజలు భారీగా తరలి రావాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయ కులు బల్లెం ఆనందరావు పిలుపునిచ్చారు. ఆదివారం మండల పరిధిలోనికొత్తపేటలో వ్యవసాయ కార్మిక సంఘం గోడ పత్రికలను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ కూలీల సమస్య పరిష్కారానికి నిరంతరం వ్యవసాయ కార్మిక సంఘం పోరాడుతుందని, ప్రధానంగా కూలీ లకు పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీరేట్లు పెంచుకోవాలని, ఉపాధి కూలీ 370 ఇవ్వాలని, ఇల్లు లేని కూలీలకు డబల్ బెడ్ రూమ్ ఇళ్లు, స్థలాలు ఉన్న వారికి 5 లక్షల రూపాయలతో ప్రభుత్వమే ఇల్లు కట్టి ఇవ్వాలని, పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలని, దేశంలో రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం నిరంతరం పోరాడుతుందని పోరా టాలు నిర్వహిస్తుందన్నారు. కౌలు రైతులను గుర్తించి ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని, పనికి తగ్గ వే తనం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. ఈ కార్యక్రమంలో కడారి విజయ, ఇ.బిక్షం, బి య్యని కమలమ్మ,కొప్పులరామచంద్రయ్య, మాణిక్యం, సుగుణమ్మ, దేవదానం, ముత్యాలు పాల్గొన్నారు.