Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
గిరిజనులను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు గిరిజన బంధు పథకాన్ని త్వరలో ప్రారంభిస్తున్నట్లు సియం కేసీఆర్ ప్రకటించి మూడు నెలలు కావస్తున్నా ఇంత వరకు అమలుకు నోచుకోలేదని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ శ్రీరామ్ నాయక్ అన్నారు. మండల కేంద్రంలో వర్తక సంఘం భవనంలో ఆదివారం భూక్య శివకృష్ణ, కేళోత్ బాల, ధరావత్ లక్ష్మి, అధ్యక్ష్య వర్గంగా వ్యవహరించిన టిజిఎస్ మండల మహసభలో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లా డారు. దళితులకు ఇచ్చినట్లు గానే గిరిజనులకు కూడా గిరిజన బంధు పథకాన్ని తక్షణమే ప్రారంభించి అర్హులైన గిరిజనులందరికీ గిరిజన బంధు పథకం ద్వారా పది లక్షల రూపాయల రుణాలను అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భూమిలేని గిరిజన కుటుంబాలకు మాత్రమే గిరిజన బంధును వర్తింపజేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం సరైనది కాదని, రాష్ట్రంలో 10 లక్షల కుటుంబా లలో సెంటు భూమిలేని కుటుంబాలు కేవలం ఒక శాతం కూడా ఉండరని ఎంతో కొంత భూమిని కలిగి ఉన్నారని అన్నారు. భూమిలేని వారికి మాత్రమే గిరిజన బంధును వర్తింప చేస్తే నిరుపయోగం అని భూమిని కొలబద్ధగా తీసుకోకుండా ఆదాయాన్ని కొలమానంగా తీసుకుని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పోరా ట ఫలితంగా పోడు భూములకు హక్కులు వస్తున్నాయని, అటవీ శాఖ అధికారు లు ఇష్టానుసారంగా పోడు ధరఖాస్తులను తిరస్కరిస్తున్నారని ఆరోపించారు. పో డు భూములకు హక్కుపత్రాల రాకుండా చేస్తే మరోపోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. నూతనంగా ఏర్పాటైన తండా గ్రామ పంచాయతీలకు నిధులు లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయని, ప్రతి తండా పంచాయతీకి కోటి రూపాయల చొప్పున ప్రత్యేక నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ,బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఎని మిదేళ్లు గడుస్తున్నా అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అటవీ వ్యతిరేక విధానాల వలన దేశంలో లక్షలాది మంది గిరిజనులు అడవుల నుండి బలవంతంగా గెంటి వేయబడతారాని ఆందో ళన వ్యక్తం చేశారు. అటవీ సంరక్షణ నియమాలు 2022 బిల్లును తక్షణ ఉపసం హరించుకోవాలని డిమాండ్ చేశారు. ముందుగా పట్టణ పురవీధులలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ మహాసభలో రాష్ట్ర సహాయ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా అధ్యక్షులు ఆంగోత్ వెంకన్న, మండల కార్యదర్శి భూక్య హరి నాయక్, బానోత్ వెంకన్న, కిషన్, శాంతి కుమార్, శ్రీను, పుల్ సింగ్, రాంబాబు, వీరన్న తదితరులు పాల్గొన్నారు.