Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ రామచంద్రం
- ఏఎస్ఆర్ గార్డెన్లో సంఘమిత్ర కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు
నవతెలంగాణ-భూపాలపల్లి
తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా, అధ్యా పకులు సూచించిన అడుగుజాడల్లో విద్యను అభ్య సించి విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని కాకతీ య యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ రామచంద్రం అన్నారు. ఆదివారం భూపాలపల్లి పట్టణంలోని మంజుర్నగర్ ఏఎస్ఆర్ గార్డెన్లో సంఘమిత్ర డిగ్రీ, పీజీ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వ హించారు. కళాశాల కరస్పాండెంట్ గుర్రపు రవీందర్ అధ్యక్షతన కళాశాల ప్రిన్సిపాల్ ఎలుగురి హరికృష్ణ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథులుగా కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ డాక్టర్ వల్లూరి రామచంద్రం, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సాధు రాజేష్ హాజరై సరస్వతిదేవి చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారం భించారు. అనంతరం ప్రొఫెసర్ రామచంద్రం మాట్లాడుతూ చదువు అనే మూడు అక్షరాలను నమ్ముకొని విద్యార్థులు బాగా చదువుకుంటే ఆ మూడు అక్షరాలే విద్యార్థులను ఉన్నత స్థానంలో ఉంచుతా యని అన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ సాదు రాజేష్ మాట్లాడుతూ సింగరేణి విద్యార్థులకు భూపాలపల్లి పట్టణంలో 2005 నుండి ఉత్తమ విద్యను అందిస్తూ ఎంతోమంది విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదిగేం దుకు సంఘమిత్ర కళాశాల కృషి చేస్తున్నదని అన్నారు. త్యాగం, సహనం విద్యార్థులు అలవర్చుకుంటే సమా జంలో ఉత్తమ వ్యక్తులుగా గుర్తింపు పొందుతారని అన్నారు. కరస్పాండెంట్ గుర్రపు రవీందర్ మాట్లా డుతూ విద్యార్థులు ఇష్టముతో కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నారు. చదువుకునే దశ నుండే లక్ష్యాన్ని ఎంచుకొని అనునిత్యం లక్ష సాధనకు కషి చేయాలని, తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచిం చారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట, పాటలు అందరినీ ఆకర్షించాయి. అనంతరం సెమిస్టర్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజే శారు. ముఖ్య అతిథులు, కళాశాల లెక్చరర్స్,సిబ్బందిని కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో లెక్చరర్స్ ,విద్యార్థులు పాల్గొన్నారు.