Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు
నవతెలంగాణ-ఎల్కతుర్తి
పేద ప్రజలకు నివాస స్థలం దక్కేంతవరకు భూ పోరాటాలు ఆగవని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు అన్నారు. దండేపల్లి గ్రామంలో కామెర వెంకటరమణ అధ్యక్షతన భూ పోరాట సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ... ప్రభుత్వం పేద ప్రజలకు నివాస స్థలం, డబల్ బెడ్ రూమ్, హామీలను అమలు చేయకపోవడం మూలంగానే పేద ప్రజలు ఎర్రజెండా నీడన భూ పోరాటాలకు ముందుకు వస్తు న్నారని అన్నారు. ప్రజల ఓట్ల ద్వారా శాసన సభ్యు లుగా, పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన ప్రజాప్ర తినిధులు పేదల సమస్యలను పరిష్కరించకుండా, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాటు పడుతున్నారని విమర్శించారు. జీవో 58 అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వహిస్తుందని విమర్శించారు. ఇంటి స్థలాలతో పాటు పక్కా గృహాలు నిర్మించు కోవడం కోసం రూ.5లకలు లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామానికి చెందిన 90 మంది రైతుల పట్టా భూములు 152 ఎకరాల భూమి మిషన్ కాకతీయ ద్వారా ఊర చెరువు పునర్ నిర్మాణం పనులు చేపట్టడంతో బ్యాక్ వాటర్ ద్వారా ముంపునకు గురయ్యాయన్నారు. రైతులు ఎలాంటి పంట పండిం చుకోకుండా తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రే బిక్షపతి మాట్లాడుతూ.. హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూముల్లో నివాస స్థలం లేని పేదలు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారని, వారి నివాస స్థలాలకు పట్టాలు ఇవ్వాలని కోరారు. సమావేశంలో మండల కార్యదర్శి ఊటుకూరి రాములు, మారుపాక అనిల్ కుమార్, కర్రే లక్ష్మణ్, మర్రి శ్రీనివాస్, చంద్ర మౌళి, గడ్డం రాజనర్స్, సిర్ర మల్లయ్య, బత్తిని ప్రభా కర్, పానుగంటి లక్ష్మణ్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.